
Vivo Y78+ స్మార్ట్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ పై కనిపిస్తోంది. తాజాగా ఈ డివైజ్ గీక్ బెంచ్ పై కనిపించింది. రీసెంట్ గా ఈ ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించింది. అయితే ఆ లిస్ట్ ద్వారా పెద్దగా వివరాలు తెలియలేదు. కానీ, ఇప్పుడు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా చిప్సెట్, ర్యామ్, ఓఎస్ వివరాలు తెలిసాయి. పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
Vivo Y78+ గీక్ బెంచ్ లిస్టింగ్
V2271A అనే మోడల్ నంబర్ తో బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్ బెంచ్ పై Vivo Y78+ కనిపించింది. సింగిల్ కోర్ టెస్ట్ లో ఈ డివైజ్ 670 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 1976 పాయింట్లు సాధించింది. మైస్మార్ట్‌ప్రైస్ వెబ్ సైట్ తొలుత ఈ లిస్టింగ్ ని గుర్తించింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ మిడ్ రేంజ్ డివైజ్ అని, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోందని తెలిసింది.
Vivo Y78+ స్పెసిఫికేషన్స్ (అంచనా)
త్వరలో రాబోవు Vivo Y78+ గురించి ఎక్కువ సమాచారం లేదు. కానీ, Vivo Y78+ డివైజ్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందని అంచనా. 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు వివో సంస్థ Vivo Y78+ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎన్నో బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్స్ పై కనిపించడంతో త్వరలోనే Vivo Y78+ లాంచ్ ఉండనుందని స్పష్టమవుతోంది.
ఈ నెలలో వివో కంపెనీ Vivo T2, Vivo T2x డివైజెస్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇవి మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్స్. వివో టీ2 రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి/128జిబి వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి/128జిబి వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. వివో టీ2ఎక్స్ డివైజ్ 4జిబి/128జిబి, 6జిబి/128జిబి, 8జిబి/128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.12,999, రూ.13,999 మరియు రూ.15,999 గా ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












