Xiaomi 13 Lite - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 27 Feb 2023 09:30:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 32MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Xiaomi 13 Lite https://www.91mobiles.com/telugu/xiaomi-13-xiaomi-13-lite-launched-globally-price-specs/ Mon, 27 Feb 2023 09:30:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=5112 Xiaomi 13 Lite డివైజ్ ని షావోమి సంస్థ MWC 2023 ఈవెంట్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ తో పాటు ఇంకా టాప్ మోడల్ Xiaomi 13 Pro, Xiaomi 13 స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ అయ్యాయి. Xiaomi 13 Lite విషయానికి వస్తే, ఈ డివైజ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో లాంచ్ అయ్యాయి. లుక్ చూస్తుంటే Apple iPhone 14 Pro మాదిరి కనిపిస్తోంది. Xiaomi 13 Lite లో 32ఎంపి […]

The post 32MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Xiaomi 13 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • MWC 2023 ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ ని లాంచ్ చేసిన చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమి
  • లైనప్ లో వచ్చిన Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13 Lite
  • క్వాల్కమ్ స్నాప్ డ్రానగ్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Xiaomi 13 Lite

Xiaomi 13 Lite డివైజ్ ని షావోమి సంస్థ MWC 2023 ఈవెంట్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ తో పాటు ఇంకా టాప్ మోడల్ Xiaomi 13 Pro, Xiaomi 13 స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ అయ్యాయి. Xiaomi 13 Lite విషయానికి వస్తే, ఈ డివైజ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో లాంచ్ అయ్యాయి. లుక్ చూస్తుంటే Apple iPhone 14 Pro మాదిరి కనిపిస్తోంది.

Xiaomi 13 Lite లో 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్

  • 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 2400 x 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ గ్లాస్ ఉన్నాయి.

Xiaomi 13 Lite లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ లో అడ్రెనో644 జీపీయూ వాడారు. ఫోన్ ని వేడిమి నుంచి రక్షించేందుకు 2360ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ చాంబర్ ని అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Xiaomi 13 Lite లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 40 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఈ డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi 13 Lite లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ప్రైమరీ కెమెరా + 8ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 159.2 ఎంఎం పొడవు, 72.7 ఎంఎం వెడల్పు, 7.23 ఎంఎం మందం, 171 గ్రాముల బరువు ఉంటుంది.

Xiaomi 13 Lite ధర

Xiaomi 13 Lite డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ తో పాటు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభిస్తుంది. Xiaomi 13 Lite డివైజ్ ధర 499 యూరోలు (సుమారు రూ.43,500) తో మొదలవుతుంది. Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ, లైట్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 32MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Xiaomi 13 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
Video: Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో https://www.91mobiles.com/telugu/xiaomi-13-lite-5g-unboxing-video-design-specs/ Mon, 13 Feb 2023 11:30:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=4895 చైనీస్ కంపెనీ Xiaomi త్వరలోనే గ్లోబల్ గా Xiaomi 13 Lite 5G ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఫిబ్రవరి 26 న జరిగే ఈవెంట్ లో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా Xiaomi 13 Lite 5G కి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియో, కలర్ ఆప్షన్స్, డిజైన్ బయటకు వచ్చాయి. Xiaomi 13 Lite 5G డివైజ్ 4 కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఇంకా ఈ ఫోన్ Xiaomi […]

The post Video: Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 26 న గ్లోబల్ గా లాంచ్ అవుతోన్న Xiaomi 13 Lite 5G స్మార్ట్ ఫోన్
  • తాజాగా లీకైన Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో
  • Xiaomi Civi 2 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తోన్న Xiaomi 13 Lite 5G

చైనీస్ కంపెనీ Xiaomi త్వరలోనే గ్లోబల్ గా Xiaomi 13 Lite 5G ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఫిబ్రవరి 26 న జరిగే ఈవెంట్ లో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా Xiaomi 13 Lite 5G కి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియో, కలర్ ఆప్షన్స్, డిజైన్ బయటకు వచ్చాయి.

Xiaomi 13 Lite 5G డివైజ్ 4 కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఇంకా ఈ ఫోన్ Xiaomi Civi 2 ఫోన్ కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని కన్ఫర్మ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 6.55-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో రానుంది.

Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో

టిప్‌స్టర్ శుభ్‌మన్ అంభోరే Xiaomi 13 Lite 5G యొక్క అన్‌బాక్సింగ్ వీడియోను షేర్ చేశాడు. అలాగే స్పెసిఫికేషన్స లిస్ట్ ని కూడా పోస్ట్ చేశాడు. ఓసారి ఆ వీడియోని ఇక్కడ చూడండి.

Xiaomi 13 Lite 5G స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Lite 5G స్మార్ట్ ఫోన్ ziyi అనే కోడ్ నేమ్ తో గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా Xiaomi 13 Lite 5G స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Xiaomi 13 Lite 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 8జిబి ర్యామ్ కలిగి ఉంటుంది. లిస్టింగ్ ని గమనిస్తే Xiaomi 13 Lite 5G డివైజ్ Xiaomi Civi 2 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అనిపిస్తోంది.

Xiaomi 13 Lite 5G స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి. పిల్-షేప్డ్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Xiaomi 13 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 20ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 13 Lite 5G లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండదు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఉంటుంది. Xiaomi 13 Lite 5G హ్యాండ్సెట్ లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్ సెటప్ తో వస్తోంది. Xiaomi 13 Lite 5G ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Video: Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-13-lite-google-play-console-database-specs-civi-2-rebrand/ Thu, 12 Jan 2023 07:36:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=4445 హైలైట్స్ Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్న షావోమి సంస్థ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ Xiaomi Civi 2 ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోన్న Xiaomi 13 Lite 2022 డిసెంబర్ నెలలో చైనాలో Xiaomi 13 సిరీస్ ఫోన్లను షావోమి లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Xiaomi 13, Xiaomi 13 Pro ఫోన్లు […]

The post లీకైన Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్న షావోమి సంస్థ
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్
  • Xiaomi Civi 2 ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోన్న Xiaomi 13 Lite

2022 డిసెంబర్ నెలలో చైనాలో Xiaomi 13 సిరీస్ ఫోన్లను షావోమి లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Xiaomi 13, Xiaomi 13 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్లు ఇంకా భారత్ లో లాంచ్ కావాల్సి ఉంది. అయితే ఈ లోపు Xiaomi 13 Lite కి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. MySmartPrice ఈ మిడ్ రేంజ్ ఫోన్ ని గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై గుర్తించింది.

గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ లో ఈ డివైజ్ కోడ్ నేమ్ Ziyi గా ఉంది. రిపోర్ట్ ప్రకారం, కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచైన Xiaomi Civi 2 ఫోన్ కి Xiaomi 13 Lite రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే Xiaomi Civi 2 భారత్ లో లాంచ్ కాలేదు. బదులుగా Xiaomi 13 Lite భారత్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi 13 Lite యొక్క రెండర్ డిజైన్ చూడటానికి షావోమి సివి 2 మాదిరిగా కనిపిస్తోంది. అయితే, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 440 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చే అవకాశం ఉంది.

మనం ఒకసారి, Xiaomi Civi 2 యొక్క స్పెసిఫికేషన్స్ ని గమనిద్దాం. ఈ ఫఓన్ 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. దీంట్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Xiaomi 13 సిరీస్ ఫోన్లను త్వరలోనే షావోమి సంస్థ గ్లోబల్ గా లాంచ్ చేయనుందని సమాచారం. Mobile World Congress 2023 ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వ తేదీ వరకు స్పెయిన్ లోని బార్సిలోనా లో జరగనుంది. షావోమి నుంచి లైకా కెమెరా టెక్నాలజీతో కూడిన సరికొత్త అల్ట్రా వేరియంట్ కూడా ఈ సదస్సులో లాంచ్ కానుంది. షావోమి 13 సిరీస్ ఫోన్ల కోసం భారత్ తో పాటు యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఫోన్లు చైనాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>