లీకైన Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్న షావోమి సంస్థ
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్
  • Xiaomi Civi 2 ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోన్న Xiaomi 13 Lite

2022 డిసెంబర్ నెలలో చైనాలో Xiaomi 13 సిరీస్ ఫోన్లను షావోమి లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Xiaomi 13, Xiaomi 13 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్లు ఇంకా భారత్ లో లాంచ్ కావాల్సి ఉంది. అయితే ఈ లోపు Xiaomi 13 Lite కి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. MySmartPrice ఈ మిడ్ రేంజ్ ఫోన్ ని గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై గుర్తించింది.

గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ లో ఈ డివైజ్ కోడ్ నేమ్ Ziyi గా ఉంది. రిపోర్ట్ ప్రకారం, కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచైన Xiaomi Civi 2 ఫోన్ కి Xiaomi 13 Lite రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే Xiaomi Civi 2 భారత్ లో లాంచ్ కాలేదు. బదులుగా Xiaomi 13 Lite భారత్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi 13 Lite యొక్క రెండర్ డిజైన్ చూడటానికి షావోమి సివి 2 మాదిరిగా కనిపిస్తోంది. అయితే, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 440 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చే అవకాశం ఉంది.

మనం ఒకసారి, Xiaomi Civi 2 యొక్క స్పెసిఫికేషన్స్ ని గమనిద్దాం. ఈ ఫఓన్ 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. దీంట్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Xiaomi 13 సిరీస్ ఫోన్లను త్వరలోనే షావోమి సంస్థ గ్లోబల్ గా లాంచ్ చేయనుందని సమాచారం. Mobile World Congress 2023 ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వ తేదీ వరకు స్పెయిన్ లోని బార్సిలోనా లో జరగనుంది. షావోమి నుంచి లైకా కెమెరా టెక్నాలజీతో కూడిన సరికొత్త అల్ట్రా వేరియంట్ కూడా ఈ సదస్సులో లాంచ్ కానుంది. షావోమి 13 సిరీస్ ఫోన్ల కోసం భారత్ తో పాటు యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఫోన్లు చైనాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleనేడే Samsung Galaxy F04 ఫస్ట్ సేల్
Next articleSnapdragon 7 Gen 2 చిప్‌తో వస్తోన్న Redmi Note 12 Turbo
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.