Xiaomi 13 Series - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 Aug 2022 05:51:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఈఈసీ పై కనిపించిన Xiaomi 13, Redmi Note 12, త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/xiaomi-13-series-redmi-12-series-spotted-eec-certification/ Tue, 23 Aug 2022 05:48:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=1826 హైలైట్స్: 2210132జి, 2210133జి అనే మోడల్ నంబర్స్ తో ఈఈసీ సర్టిఫికేషన్ పై కనిపించిన షావోమీ 13 డివైజెస్ అదే సర్టిఫికేషన్ పై 22101316జి, 22101316యుజి అనే మోడల్ నంబర్లతో కనిపించిన రెడ్మీ నోట్ 12 సిరీస్ ఈ ఏడాది నవంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్ జులైలో షావోమీ 12ఎస్ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. అవి: షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ […]

The post ఈఈసీ పై కనిపించిన Xiaomi 13, Redmi Note 12, త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2210132జి, 2210133జి అనే మోడల్ నంబర్స్ తో ఈఈసీ సర్టిఫికేషన్ పై కనిపించిన షావోమీ 13 డివైజెస్
  • అదే సర్టిఫికేషన్ పై 22101316జి, 22101316యుజి అనే మోడల్ నంబర్లతో కనిపించిన రెడ్మీ నోట్ 12 సిరీస్
  • ఈ ఏడాది నవంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్

జులైలో షావోమీ 12ఎస్ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. అవి: షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ ప్రో, షావోమీ 12ఎస్ అల్ట్రా. ఈ లైనప్ లో ఇంకా షావోమీ 12ఎక్స్ కూడా ఉంది. ఇప్పుడు షావోమీ 13 సిరీస్ ను లాంచ్ చేయాలని సదరు కంపెనీ భావిస్తోంది. షెడ్యూల్ కంటే ముందే షావోమీ 13 సిరీస్ ను లాంచ్ చేసి, తన హోమ్ ల్యాండ్ చైనాలో సేల్స్ ను పెంచుకోవాలని షావోమీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పుడు ఈఈసీ సర్టిఫికేషన్ పై షావోమీ 13 సిరీస్, రెడ్మీ డివైజెస్ ను మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించింది. రెడ్మీ డివైజెస్ రెడ్మీ 12 సిరీస్ అని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే లిస్టింగ్ ద్వారా కేవలం మోడల్ నంబర్స్ మాత్రమే తెలుస్తున్నాయి. ఏదైతేనేం, త్వరలోనే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని దీన్ని సంకేతంగా భావించవచ్చు.

 

EEC పై కనిపించిన Xiaomi 13, Redmi Note 12 ఫోన్స్

2210132జి, 2210133జి అనే మోడల్ నంబర్లతో ఈఈసీ సర్టిఫికేషన్ పై షావోమీ నుంచి రాబోవు డివైజెస్ దర్శనమిచ్చాయి. ఇవి షావోమీ 13 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్స్ అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి కేవలం మోడల్ నంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కనుక అప్పుడే ఏమీ చెప్పలేం.

ఇక మరో ఈఈసీ లిస్టింగ్ లో రెండు కొత్త రెడ్మీ ఫోన్స్ కనిపించాయి. ఇవి 22101316జి, 22101316యుజి మోడల్ నంబర్స్ తో కనిపించాయి. ఇక మోడల్ నంబర్స్ చివర్లో ఉన్న జి లెటర్ గ్లోబల్ అనే అర్థం ఇస్తోందని అనుకోవచ్చు. ఈ రెండు మోడల్స్ కూడా షావోమీ కమ్యునికేషన్స్ క్రింద రిజిస్టర్ అయ్యాయి. మోడల్ నంబర్స్ తప్పితే, ఇతర స్పెసిఫికేషన్స్ గురించి ఏం తెలియదు.

షావోమీ 13 సిరీస్ ఈ ఏడాది ముగిసే నాటికి, బహుశా నవంబర్ కల్లా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్లు వస్తాయని భావిస్తున్నారు. నవంబర్ లో జరగనున్న క్వాల్కమ్ టెక్ సమ్మిట్ లో ఈ చిప్సెట్ ను రివీల్ చేసే అవకాశముంది. షావోమీ 13 సిరీస్ సింగిల్-సెల్ బ్యాటరీతో వస్తుందని సమాచారం. ఈ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. సర్జ్ పీ1 చిప్ ప్రస్తుతానికి ఇండస్ట్రీలో ఉన్న ఏకైన 100 వాట్ సింగిల్-సెల్ చిప్ సొల్యూషన్ అని అంటున్నారు.

రెడ్మీ నోట్ 12 సిరీస్ పై పెద్దగా రూమర్లు ఏమీ వినిపించడం లేదు. అయితే, రెడ్మీ నోట్ 11 లైనప్ కి 12 సిరీస్ ఫోన్లు సక్సెసర్స్ గా రానున్నాయని చెప్పవచ్చు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

The post ఈఈసీ పై కనిపించిన Xiaomi 13, Redmi Note 12, త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 13 సిరీస్ లాంచ్ అప్డేట్ https://www.91mobiles.com/telugu/xiaomi-to-launch-xiaomi13-series-much-before-the-regular-launch-cycle/ Tue, 19 Jul 2022 11:37:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=1067 హైలైట్స్: డిసెంబర్ కంటే ముందే లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న ఈ సిరీస్ నవంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న షావోమీ 13 సిరీస్ రీసెంట్ గా షావోమీ 12ఎస్ సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ ప్రో, […]

The post Xiaomi 13 సిరీస్ లాంచ్ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • డిసెంబర్ కంటే ముందే లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న ఈ సిరీస్ నవంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం
  • 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న షావోమీ 13 సిరీస్

రీసెంట్ గా షావోమీ 12ఎస్ సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ ప్రో, షావోమీ 12ఎస్ అల్ట్రా మోడల్స్ ఉన్నాయి. లైకా ఆప్టిక్స్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్ తో వచ్చిన తొలి సిరీస్ షావోమీ 12ఎస్. ఇఖ అల్ట్రా మోడల్ విషయానికి వస్తే, ఇందులో సోనీ 1-ఇంచ్ సెన్సర్ ను వాడారు.ఇప్పుడు షావోమీ 13 సిరీస్ పై కంపెనీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే షావోమీ 12 సిరీస్ కి సక్సెసర్ సిరీస్ వస్తుందని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.

నవంబర్ లో లాంచ్ అవుతుందని భావిస్తోన్న షావోమీ 13 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనున్నట్లు సమాచారం. ఈ చిప్సెట్ జీపీయూ ఇంప్రూవ్మెంట్స్ తో పాటు మెరుగైన పెర్ఫామెన్స్ ను అందిస్తుందని తెలుస్తోంది. షావోమీ 13 సిరీస్ నుంచి ఏడాదికో ఫోన్ లాంచ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Xiaomi 13 సిరీస్ స్పెసిఫికేషన్స్

ఈ ఏడాది ఏ సమయంలోనైనా షావోమీ 13 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశముంది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్ లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే రెగ్యులర్ లాంచ్ సైకిల్ కంటే ముందే షావోమీ 13 సిరీస్ లాంచ్ కానున్నట్లు సమాచారం. ప్రముఖ లీక్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షావోమీ 13 సిరీస్ కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది.

టిప్ స్టర్ చెబుతున్న దాని ప్రకారం, షావోమీ 13 సిరీస్ 2022, నవంబర్ లో చైనాలో లాంచ్ కానుంది. ఇది రెగ్యులర్ లాంచ్ సైకిల్ డిసెంబర్ కంటే ఒక నెల ముందని అర్థమవుతోంది. అలాగే ఇది క్వాల్కమ్ సమ్మిట్ తర్వాత అని గమనించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి తెలుస్తున్న మరో విషయం ఏంటంటే, క్వాల్కమ్ కూడా తన చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ని ఒక నెల ముందుగానే అనౌన్స్ చేయనుంది. అంటే నవంబర్ మొదటి వారమని అంచనా వేయొచ్చు. ఇక నవంబర్ లో 13 సిరీస్ ను లాంచ్ చేసి, క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ చిప్సెట్ 8 జెన్ 2 తో వచ్చిన తొలి ఫోన్ తనదే అనిపించుకోవాలని షావోమీ భావిస్తున్నట్లుంది.

ఇక షావోమీ 13 సిరీస్ సింగిల్ సెల్ బ్యాటరీ తో రానున్నట్ల డిజిటల్ ఛాట్ స్టేషన్ తెలిపింది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే ఇన్-హౌజ్ ఛార్జింగ్ ఐసీ తో షావోమీ 13 రానున్నట్లు సమాచారం.దీన్ని బట్టి 100 వాట్ సింగిల్ సెల్ చిప్ సొల్యూషన్ అయిన సర్జ్ పీ1 చిప్ ఈ ఫోన్స్ లో ఉండనున్నట్లు అర్థమవుతోంది. అయితే లాంచ్ కి ఇంకా కొన్ని నెలలు సమయం ఉన్నందున ఈలోపు షావోమీ 13 సిరీస్ కు సంబంధించి మరిన్ని వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యేందుకు అవకాశాలున్నాయి.

The post Xiaomi 13 సిరీస్ లాంచ్ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>