హైలైట్స్:
- 2210132జి, 2210133జి అనే మోడల్ నంబర్స్ తో ఈఈసీ సర్టిఫికేషన్ పై కనిపించిన షావోమీ 13 డివైజెస్
- అదే సర్టిఫికేషన్ పై 22101316జి, 22101316యుజి అనే మోడల్ నంబర్లతో కనిపించిన రెడ్మీ నోట్ 12 సిరీస్
- ఈ ఏడాది నవంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్

జులైలో షావోమీ 12ఎస్ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. అవి: షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ ప్రో, షావోమీ 12ఎస్ అల్ట్రా. ఈ లైనప్ లో ఇంకా షావోమీ 12ఎక్స్ కూడా ఉంది. ఇప్పుడు షావోమీ 13 సిరీస్ ను లాంచ్ చేయాలని సదరు కంపెనీ భావిస్తోంది. షెడ్యూల్ కంటే ముందే షావోమీ 13 సిరీస్ ను లాంచ్ చేసి, తన హోమ్ ల్యాండ్ చైనాలో సేల్స్ ను పెంచుకోవాలని షావోమీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పుడు ఈఈసీ సర్టిఫికేషన్ పై షావోమీ 13 సిరీస్, రెడ్మీ డివైజెస్ ను మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించింది. రెడ్మీ డివైజెస్ రెడ్మీ 12 సిరీస్ అని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే లిస్టింగ్ ద్వారా కేవలం మోడల్ నంబర్స్ మాత్రమే తెలుస్తున్నాయి. ఏదైతేనేం, త్వరలోనే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని దీన్ని సంకేతంగా భావించవచ్చు.
EEC పై కనిపించిన Xiaomi 13, Redmi Note 12 ఫోన్స్
2210132జి, 2210133జి అనే మోడల్ నంబర్లతో ఈఈసీ సర్టిఫికేషన్ పై షావోమీ నుంచి రాబోవు డివైజెస్ దర్శనమిచ్చాయి. ఇవి షావోమీ 13 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్స్ అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి కేవలం మోడల్ నంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కనుక అప్పుడే ఏమీ చెప్పలేం.
ఇక మరో ఈఈసీ లిస్టింగ్ లో రెండు కొత్త రెడ్మీ ఫోన్స్ కనిపించాయి. ఇవి 22101316జి, 22101316యుజి మోడల్ నంబర్స్ తో కనిపించాయి. ఇక మోడల్ నంబర్స్ చివర్లో ఉన్న జి లెటర్ గ్లోబల్ అనే అర్థం ఇస్తోందని అనుకోవచ్చు. ఈ రెండు మోడల్స్ కూడా షావోమీ కమ్యునికేషన్స్ క్రింద రిజిస్టర్ అయ్యాయి. మోడల్ నంబర్స్ తప్పితే, ఇతర స్పెసిఫికేషన్స్ గురించి ఏం తెలియదు.
షావోమీ 13 సిరీస్ ఈ ఏడాది ముగిసే నాటికి, బహుశా నవంబర్ కల్లా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్లు వస్తాయని భావిస్తున్నారు. నవంబర్ లో జరగనున్న క్వాల్కమ్ టెక్ సమ్మిట్ లో ఈ చిప్సెట్ ను రివీల్ చేసే అవకాశముంది. షావోమీ 13 సిరీస్ సింగిల్-సెల్ బ్యాటరీతో వస్తుందని సమాచారం. ఈ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. సర్జ్ పీ1 చిప్ ప్రస్తుతానికి ఇండస్ట్రీలో ఉన్న ఏకైన 100 వాట్ సింగిల్-సెల్ చిప్ సొల్యూషన్ అని అంటున్నారు.
రెడ్మీ నోట్ 12 సిరీస్ పై పెద్దగా రూమర్లు ఏమీ వినిపించడం లేదు. అయితే, రెడ్మీ నోట్ 11 లైనప్ కి 12 సిరీస్ ఫోన్లు సక్సెసర్స్ గా రానున్నాయని చెప్పవచ్చు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.











