Xiaomi 13 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 27 Feb 2023 09:30:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 32MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Xiaomi 13 Lite https://www.91mobiles.com/telugu/xiaomi-13-xiaomi-13-lite-launched-globally-price-specs/ Mon, 27 Feb 2023 09:30:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=5112 Xiaomi 13 Lite డివైజ్ ని షావోమి సంస్థ MWC 2023 ఈవెంట్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ తో పాటు ఇంకా టాప్ మోడల్ Xiaomi 13 Pro, Xiaomi 13 స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ అయ్యాయి. Xiaomi 13 Lite విషయానికి వస్తే, ఈ డివైజ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో లాంచ్ అయ్యాయి. లుక్ చూస్తుంటే Apple iPhone 14 Pro మాదిరి కనిపిస్తోంది. Xiaomi 13 Lite లో 32ఎంపి […]

The post 32MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Xiaomi 13 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • MWC 2023 ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ ని లాంచ్ చేసిన చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమి
  • లైనప్ లో వచ్చిన Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13 Lite
  • క్వాల్కమ్ స్నాప్ డ్రానగ్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Xiaomi 13 Lite

Xiaomi 13 Lite డివైజ్ ని షావోమి సంస్థ MWC 2023 ఈవెంట్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ తో పాటు ఇంకా టాప్ మోడల్ Xiaomi 13 Pro, Xiaomi 13 స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ అయ్యాయి. Xiaomi 13 Lite విషయానికి వస్తే, ఈ డివైజ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో లాంచ్ అయ్యాయి. లుక్ చూస్తుంటే Apple iPhone 14 Pro మాదిరి కనిపిస్తోంది.

Xiaomi 13 Lite లో 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్

  • 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 2400 x 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ గ్లాస్ ఉన్నాయి.

Xiaomi 13 Lite లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ లో అడ్రెనో644 జీపీయూ వాడారు. ఫోన్ ని వేడిమి నుంచి రక్షించేందుకు 2360ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ చాంబర్ ని అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Xiaomi 13 Lite లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 40 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఈ డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi 13 Lite లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ప్రైమరీ కెమెరా + 8ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 159.2 ఎంఎం పొడవు, 72.7 ఎంఎం వెడల్పు, 7.23 ఎంఎం మందం, 171 గ్రాముల బరువు ఉంటుంది.

Xiaomi 13 Lite ధర

Xiaomi 13 Lite డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ తో పాటు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభిస్తుంది. Xiaomi 13 Lite డివైజ్ ధర 499 యూరోలు (సుమారు రూ.43,500) తో మొదలవుతుంది. Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ, లైట్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 32MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Xiaomi 13 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
IP68 రేటింగ్, 67W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Xiaomi 13 https://www.91mobiles.com/telugu/xiaomi-13-launched-globally-price-specs-mwc-2023/ Mon, 27 Feb 2023 06:28:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=5109 ఫిబ్రవరి 27 న అంటే నేడు MWC 2023 ప్రారంభమైంది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్ సందర్భంగా చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi తన ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 13 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Xiaomi 13 Pro, Xiaomi 13, Xiaomi 13 Lite ఫోన్లు ఉన్నాయి. Xiaomi 13, Xiaomi 13 Lite ఫోన్లు భారత్ లో తర్వాత లాంచ్ […]

The post IP68 రేటింగ్, 67W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Xiaomi 13 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రో-మోడల్ తో పాటు Xiaomi 13, Xiaomi 13 Lite ఫోన్లను లాంచ్ చేసిన Xiaomi
  • Snapdragon 8 Gen 2 చిప్సెట్ తో లాంచైన Xiaomi 13
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, లైకా కెమెరాలు, 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చిన Xiaomi 13

ఫిబ్రవరి 27 న అంటే నేడు MWC 2023 ప్రారంభమైంది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్ సందర్భంగా చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi తన ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 13 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Xiaomi 13 Pro, Xiaomi 13, Xiaomi 13 Lite ఫోన్లు ఉన్నాయి.

Xiaomi 13, Xiaomi 13 Lite ఫోన్లు భారత్ లో తర్వాత లాంచ్ కానున్నాయి. ప్రో-వర్షన్ ఇప్పటికే భారత మార్కెట్ కోసం షావోమి అన్‌వీల్ చేసింది. సరే, ఓసారి Xiaomi 13 ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Xiaomi 13 ధర

బేస్ వేరియంట్ అయిన Xiaomi 13 ధర 999 యూరోలు గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్, ఫ్లోరా గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Xiaomi 13 Lite ధర 499 యూరోలు (సుమారు రూ.43,700) గా ఉంది. ఈ ఫోన్ లైట్ బ్లూ, లైట్ పింక్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్

Xiaomi 13 డివైజ్ లో 6.36-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ వచ్చింది. 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని ఈ ఫోన్ లో అందించారు. టిపికల్ బ్రైట్నెస్ 1200 నిట్స్ గా ఉంటుంది. 413పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, హెచ్డీఆర్10+, పీ3 కలర్ గేముత్, డాల్బి విజన్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Xiaomi 13 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడారు. టీఎస్ఎంసీ యొక్క 4 ఎన్ఎమ్ ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వాడారు. అలాగే స్నాప్ డ్రాగన్ ఎక్స్70 5జీ మోడెమ్ ని ఈ ఫోన్ లో వినియోగించారు. Xiaomi 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా విభాగం విషయానికి వస్తే, Xiaomi 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. లైకా ఈ కెమెరాల సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 మెయిన్ సెన్సర్ (హైపర్ ఓఐఎస్), 10ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా అందించారు.

Xiaomi 13 లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. డాల్బి అట్మాస్ కి సపోర్ట్ చేసే స్పీకర్ సెటప్ ఈ ఫోన్ లో ఉంది.

Xiaomi 13 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 152.8 ఎంఎం పొడవు, 71.5 ఎంఎం వెడల్పు, 7.98 ఎంఎం మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post IP68 రేటింగ్, 67W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Xiaomi 13 first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్, 50mp Sony IMX800 కెమెరాతో లాంచైన Xiaomi 13 https://www.91mobiles.com/telugu/xiaomi-13-launched-in-china-price-specs-color-options/ Mon, 12 Dec 2022 04:19:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=3926 హైలైట్స్ చైనాలో లాంచైన Xiaomi 13 సిరీస్ లైనప్ లో వచ్చిన మోడల్స్ Xiaomi 13, Xiaomi 13 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.36-ఇంచ్ డిస్ప్లే, 50ఎంపి సోని ఐఎంఎక్స్800 కెమెరాతో లాంచైన Xiaomi 13 చైనాలో Xiaomi 13 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Xiaomi 13 మరియు Xiaomi 13 Pro మోడల్స్ ని షావోమి తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన Xiaomi 12 […]

The post Snapdragon 8 Gen 2 చిప్, 50mp Sony IMX800 కెమెరాతో లాంచైన Xiaomi 13 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Xiaomi 13 సిరీస్
  • లైనప్ లో వచ్చిన మోడల్స్ Xiaomi 13, Xiaomi 13 Pro
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.36-ఇంచ్ డిస్ప్లే, 50ఎంపి సోని ఐఎంఎక్స్800 కెమెరాతో లాంచైన Xiaomi 13

చైనాలో Xiaomi 13 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Xiaomi 13 మరియు Xiaomi 13 Pro మోడల్స్ ని షావోమి తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన Xiaomi 12 మరియు Xiaomi 12 Pro లకి సక్సెసర్స్ గా Xiaomi 13 సిరీస్ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫ్లాగ్షిప్ డివైజెస్ క్వాల్కమ్ కంపెనీ తయారు చేసిన లేటెస్ట్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలో 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, లైకా-బ్రాండెడ్ కెమెరాలు ఉన్నాయి.

Xiaomi 13, Xiaomi 13 Pro ధరలు, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఆదివారం నాడు జరిగిన ఈవెంట్ లో ప్రకటించారు. మనమిప్పుడు స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, ఇతర వివరాలెలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 13 ధర, లభ్యత

స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర చైనాలో CNY 3999 (సుమారు రూ.47,300) తో ప్రారంభమవుతుంది. ఇక 8జిబి+256జిబి యూనిట్ ధర CNY 4299 (సుమారు రూ.51,000), 12జిబి+256జిబి వేరియంట్ ధర CNY 4599 (సుమారు రూ.55,000), 12జిబి+512జిబి మోడల్ ధర CNY 4999 (సుమారు రూ.59,200) గా ఉన్నాయి. ఇవన్నీ చైనా ధరలు కాగా, భారత్ లో లాంచ్ అయ్యాక ఈ ధరలు మారనున్నాయి. ఇకపోతే Xiaomi 13 డివైజ్ బ్లాక్, వైట్, వైల్డర్నెస్ గ్రీన్, ఫార్ మౌంటెయిన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్

Xiaomi 13 స్మార్ట్ ఫోన్ లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2400*1800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఈ ఫోన్ లో అందించారు. Xiaomi 13 ఆండ్రాయిడ్ 13 ఆధారిత, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Xiaomi 13 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. పవర్ బ్యాకప్ కోసం Xiaomi 13 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ వైర్లెస్ రివర్స్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 13 సిరీస్ లో కెమెరా సిస్టమ్ కోసం షావోమి మరియు లైకా సంస్థలు జట్టు కట్టాయి. Xiaomi 13 ఫోన్ లో లైకా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ సెన్సర్, 10ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 చిప్, 50mp Sony IMX800 కెమెరాతో లాంచైన Xiaomi 13 first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ https://www.91mobiles.com/telugu/xiaomi-13-series-new-launch-date-announced-by-the-company/ Fri, 09 Dec 2022 04:17:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=3894 హైలైట్స్ Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమీ లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 13 మరియు Xiaomi 13 Pro ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Buds 4, Xiaomi Watch S2 మరియు PC desktop Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది. డిసెంబర్ 11 న రాత్రి 7 గంటలకు ఫోన్లు లాంచ్ […]

The post డిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమీ
  • లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 13 మరియు Xiaomi 13 Pro
  • ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Buds 4, Xiaomi Watch S2 మరియు PC desktop

Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది. డిసెంబర్ 11 న రాత్రి 7 గంటలకు ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అసలైతే షావోమి 13 సిరీస్ లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 1 న జరగాల్సింది. కానీ చైనా మాజీ లీడర్ జియాంగ్ జెమిన్ మరణంతో ఈవెంట్ ని వాయిదా వేశారు. Xiaomi 13 మరియు Xiaomi 13 Pro డివైజెస్ రెండు కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తున్నాయి.

ఇన్వైట్ ఇమేజ్ టీజర్ ద్వారా Xiaomi 13 బాక్సీ డిజైన్ లో ఉంటుందని తెలుస్తోంది. అంటే ఐఫోన్స్ మాదిరి అన్నమాట. మరోవైపు Xiaomi 13 Pro కర్వ్డ్ డిస్ప్లేతో రౌండెడ్ ఎడ్జెస్ తో కనిపిస్తోంది. రెండు ఫోన్లూ కూడా రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉన్నాయి. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్

Xiaomi 13 స్మార్ట్ ఫోన్ 6.2-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, డీసీ డిమ్మింగ్, ఫ్లాట్ ఎడ్జెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Xiaomi 13 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ఓఐఎస్ మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు 32ఎంపి కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 13 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుందని అంచనా. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

Xiaomi 13 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమీరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ https://www.91mobiles.com/telugu/xiaomi-13-series-launch-date-announced/ Mon, 28 Nov 2022 07:40:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=3699 హైలైట్స్ Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమి Xiaomi 13 సిరీస్ లో భాగంగా లాంచ్ కానున్న Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Watch S2, Xiaomi Buds 4 TWS ఇయర్ బడ్స్, MIUI 14 కస్టమ్ స్కిన్ Xiaomi 13 సిరీస్ డిసెంబర్ 1 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా […]

The post డిసెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమి
  • Xiaomi 13 సిరీస్ లో భాగంగా లాంచ్ కానున్న Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G
  • Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Watch S2, Xiaomi Buds 4 TWS ఇయర్ బడ్స్, MIUI 14 కస్టమ్ స్కిన్

Xiaomi 13 సిరీస్ డిసెంబర్ 1 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఈ లైనప్ లో Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G మోడల్స్ లాంచ్ కానున్నాయి. Xiaomi 13 సిరీస్ తో పాటు ఎంఐయూఐ 14, షావోమి వాచ్ ఎస్2, షావోమి బడ్స్ 4 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ లాంచ్ అవ్వనున్నాయి.

Xiaomi 13 సిరీస్ లాంచ్

Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని షావోమి కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 1 న Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ లో మొత్తం ఎన్ని మోడల్స్ ఉంటాయో కంపెనీ వెల్లడించలేదు. ఇప్పటికైతే, ఈ లైనప్ లో Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతాయని సమాచారం. మరోవైపు, Xiaomi 13 సిరీస్ తో పాటు డిసెంబర్ 1 న MIUI 14, Mi Watch S2, Xiaomi Buds 4 ఇయర్ బడ్స్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

Xiaomi 13 సిరీస్ మోడల్స్

Xiaomi 13 సిరీస్ మోడల్స్ ని కంపెనీ అధికారికంగా రివీల్ చేయలేదు. అయితే లీక్స్ ఆధారంగా Xiaomi 13 సిరీస్ లో Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13X, Xiaomi 13S Ultra స్మార్ట్ ఫోన్స్ ఉంటాయిన తెలుస్తోంది. సిరీస్ లో Xiaomi 13 Pro బిగ్గెస్ట్ మోడల్ గా చెప్పబడుతోంది. మరి Xiaomi 13 Pro యొక్క స్పెసిఫికేషన్స్ (అంచనా) ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఎల్టీపీవో 2కే రెజుల్యూషన్ తో రానుంది. ఈ స్క్రీన్ ఈ6 అమోలెడ్ ప్యానెల్ తో తయారైంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. పంచ్-హోల్ డిస్ప్లే ని ఈ ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం.

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ తయారు చేసిన ఈ శక్తివంతమైన ప్రాసెసర్ ని వన్‌ప్లస్ 11 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్, ఐకూ 11 సిరీస్ లలో కూడా వాడుతున్నారు. Xiaomi 13 Pro 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.

ఇప్పుడు Xiaomi 13 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 13 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని తెలుస్తోంది. ఈ డివైజ్ లో బ్యాక్ ప్యానెల్ పై మొత్తం మూడు 50ఎంపి కెమెరాలు ఉంటాయి. వీటిలో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్ + 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా + 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

పవర్ బ్యాకప్ కోసం Xiaomi 13 Pro లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13 https://www.91mobiles.com/telugu/xiaomi-13-bis-certification-india-launch/ Tue, 15 Nov 2022 15:31:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=3457 హైలైట్స్ త్వరలో చైనాలో లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న Xiaomi 13 స్మార్ట్ ఫోన్ తాజాగా BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ Xiaomi 13 ని చైనాలో లాంచ్ చేయనుంది. 2022 డిసెంబర్ లో చైనాలో Xiaomi 13 ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. […]

The post BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న Xiaomi 13 స్మార్ట్ ఫోన్
  • తాజాగా BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13
Image: OnLeaks

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ Xiaomi 13 ని చైనాలో లాంచ్ చేయనుంది. 2022 డిసెంబర్ లో చైనాలో Xiaomi 13 ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అంటే స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 ని షావోమి అతి త్వరలో భారత్ లో లాంచ్ చేయనుందన్న మాట. దీనికి బలం చేకూర్చుతూ, తాజాగా Xiaomi 13 డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది.

భారత్ లో Xiaomi 13 లాంచ్

పైన కనిపిస్తోన్న BIS లిస్టింగ్ ఇమేజ్ ద్వారా, Xiaomi 13 స్మార్ట్ ఫోన్ 2210132G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. రీసెంట్ గా ఈ డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ ని పొందింది. అయినప్పటికీ, సర్టిఫికేషన్ లిస్టింగ్ అనేది లాంచ్ ని ఖరారు చేయదు. అయితే షావోమి తన ఫ్లాగ్షిప్ డివైజ్ ని గత ఫ్లాగ్షిప్ మాదిరే భారత్ కి తీసుకొస్తుందని చెప్పవచ్చు. మోడల్ నంబర్ లో కనిపించిన G అక్షరం గ్లోబల్ వేరియంట్ అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే గ్లోబల్ వేరియంట్ భారత్ లో లాంచ్ కానుందని దీని ద్వారా తెలుస్తోంది. అంటే భారత్ లో ఈ డివైజ్ ని షావోమి తయారు చేసే అవకాశం లేదన్నమాట.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi 13 6.2-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే తో రానుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీ కెమెరా కోసం సెంటర్ పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఇందులో ఉండనుంది. ఈ డివైజ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు సమాచారం. కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండనుంది. ఇతర లెన్సెస్ వివరాలు ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో ఇతర కెమెరా లెన్సెస్ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Xiaomi 13 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ని వాడినట్లు సమాచారం. ఇది 12జిబి వరకు ర్యామ్ మరియు 256జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది. లీకైన రెండర్స్ ని బట్టి Xiaomi 13 స్క్వేర్ షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. ఫ్లాగ్షిప్ డివైజ్ కాబట్టి ఇందులో మెటల్ ఫ్రేమ్ ఉండే అవకాశం ఉంది. Xiaomi 13 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని చెబుతున్నారు.

భారత్ లో Xiaomi 13 త్వరగా లాంచ్ అయ్యే అవకాశం ఉంటే, షావోమి నుంచి త్వరలోనే ప్రకటన లేదా టీజర్ వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13 first appeared on 91Mobiles Telugu.

]]>
3C సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయిన Xiaomi 13 ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-13-series-fast-charging-specs-revealed/ Tue, 18 Oct 2022 14:18:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=2952 హైలైట్స్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13 ఎంఐయూఐ 14, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాస్, 50వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న Xiaomi 13 ఈ ఏడాది Xiaomi 13 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం Xiaomi 12 కి సక్సెసర్ గా త్వరలోనే Xiaomi 13 మార్కెట్ లోకి రానుందని సమాచారం. ప్రస్తుతం షావోమీ సంస్థ ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ […]

The post 3C సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయిన Xiaomi 13 ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13
  • ఎంఐయూఐ 14, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాస్, 50వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న Xiaomi 13
  • ఈ ఏడాది Xiaomi 13 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం

Xiaomi 12 కి సక్సెసర్ గా త్వరలోనే Xiaomi 13 మార్కెట్ లోకి రానుందని సమాచారం. ప్రస్తుతం షావోమీ సంస్థ ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో రెండు మోడల్స్ ఉంటాయి. అవి: Xiaomi 13, Xiaomi 13 Pro. ఈ రెండు ఫోన్లు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తాయని సమాచారం. నవంబర్ లో Xiaomi 13 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలె నెట్టింట్లో ప్రత్యక్షమైన లైవ్ ఇమేజ్ ద్వారా ఫోన్ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. చూస్తుంటే షావోమీ 11 అల్ట్రా డిజైన్ మాదిరి Xiaomi 13 డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు Xiaomi 13 సిరీస్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ ను పొందింది. సదరు వెబ్ సైట్ పై 2211133C అనే మోడల్ నంబర్ తో షావోమీ 13 కనిపించింది. MySmartPrice వెబ్ సైట్ ఈ విషయాన్ని గమనించింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉండనుందని తెలుస్తోంది. షావోమీ 12 కూడా 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తోనే వచ్చింది.

Xiaomi 13 లైవ్ ఇమేజ్

Xiaomi 13 లైవ్ ఇమేజ్ ద్వారా మనం ఫోన్ యొక్క ఫ్రంట్, రియర్ డిజైన్ ని గమనించవచ్చు. ఫ్రంట్ పంచ్-హోల్ కటౌట్ సెల్ఫీ స్నాపర్, సన్నని బెజెల్స్ కనిపిస్తున్నాయి. Xiaomi 13 ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 12జిబి ర్యామ్, 3జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ తో రానున్నట్లు మరొక వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi 13 ఫోన్ వెనకాల స్క్వేర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే లేజర్ ఆటోఫోకస్ టెక్ట్స్ మాడ్యూల్ పై కనిపిస్తోంది. ఫోన్ గ్రే కలర్ లో కనిపిస్తోంది. అయితే ఇంకా ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి Xiaomi 13 గురించి తెలిసిన వివరాలివే.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi 13 స్మార్ట్ ఫోన్ 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో రానుంది. Xiaomi 13 లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుందని సమాచారం.

మరోవైపు Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.73-ఇంచ్ క్యూహెచ్డీ+ ప్యానెల్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 3C సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయిన Xiaomi 13 ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>