డిసెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్

హైలైట్స్

  • Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన షావోమి
  • Xiaomi 13 సిరీస్ లో భాగంగా లాంచ్ కానున్న Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G
  • Xiaomi 13 సిరీస్ తో పాటు లాంచ్ కానున్న Xiaomi Watch S2, Xiaomi Buds 4 TWS ఇయర్ బడ్స్, MIUI 14 కస్టమ్ స్కిన్

Xiaomi 13 సిరీస్ డిసెంబర్ 1 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఈ లైనప్ లో Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G మోడల్స్ లాంచ్ కానున్నాయి. Xiaomi 13 సిరీస్ తో పాటు ఎంఐయూఐ 14, షావోమి వాచ్ ఎస్2, షావోమి బడ్స్ 4 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ లాంచ్ అవ్వనున్నాయి.

Xiaomi 13 సిరీస్ లాంచ్

Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని షావోమి కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 1 న Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ లో మొత్తం ఎన్ని మోడల్స్ ఉంటాయో కంపెనీ వెల్లడించలేదు. ఇప్పటికైతే, ఈ లైనప్ లో Xiaomi 13 5G, Xiaomi 13 Pro 5G స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతాయని సమాచారం. మరోవైపు, Xiaomi 13 సిరీస్ తో పాటు డిసెంబర్ 1 న MIUI 14, Mi Watch S2, Xiaomi Buds 4 ఇయర్ బడ్స్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

Xiaomi 13 సిరీస్ మోడల్స్

Xiaomi 13 సిరీస్ మోడల్స్ ని కంపెనీ అధికారికంగా రివీల్ చేయలేదు. అయితే లీక్స్ ఆధారంగా Xiaomi 13 సిరీస్ లో Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi 13X, Xiaomi 13S Ultra స్మార్ట్ ఫోన్స్ ఉంటాయిన తెలుస్తోంది. సిరీస్ లో Xiaomi 13 Pro బిగ్గెస్ట్ మోడల్ గా చెప్పబడుతోంది. మరి Xiaomi 13 Pro యొక్క స్పెసిఫికేషన్స్ (అంచనా) ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఎల్టీపీవో 2కే రెజుల్యూషన్ తో రానుంది. ఈ స్క్రీన్ ఈ6 అమోలెడ్ ప్యానెల్ తో తయారైంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. పంచ్-హోల్ డిస్ప్లే ని ఈ ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం.

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ తయారు చేసిన ఈ శక్తివంతమైన ప్రాసెసర్ ని వన్‌ప్లస్ 11 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్, ఐకూ 11 సిరీస్ లలో కూడా వాడుతున్నారు. Xiaomi 13 Pro 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.

ఇప్పుడు Xiaomi 13 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 13 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని తెలుస్తోంది. ఈ డివైజ్ లో బ్యాక్ ప్యానెల్ పై మొత్తం మూడు 50ఎంపి కెమెరాలు ఉంటాయి. వీటిలో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్ + 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా + 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

పవర్ బ్యాకప్ కోసం Xiaomi 13 Pro లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleAirtel 319 vs Vodafone Idea 319: రెండింట్లో ఏది బెస్ట్ ప్లాన్
Next articleMediaTek Dimensity 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.