Xiaomi Civi 2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 13 Feb 2023 11:30:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Video: Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో https://www.91mobiles.com/telugu/xiaomi-13-lite-5g-unboxing-video-design-specs/ Mon, 13 Feb 2023 11:30:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=4895 చైనీస్ కంపెనీ Xiaomi త్వరలోనే గ్లోబల్ గా Xiaomi 13 Lite 5G ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఫిబ్రవరి 26 న జరిగే ఈవెంట్ లో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా Xiaomi 13 Lite 5G కి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియో, కలర్ ఆప్షన్స్, డిజైన్ బయటకు వచ్చాయి. Xiaomi 13 Lite 5G డివైజ్ 4 కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఇంకా ఈ ఫోన్ Xiaomi […]

The post Video: Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 26 న గ్లోబల్ గా లాంచ్ అవుతోన్న Xiaomi 13 Lite 5G స్మార్ట్ ఫోన్
  • తాజాగా లీకైన Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో
  • Xiaomi Civi 2 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తోన్న Xiaomi 13 Lite 5G

చైనీస్ కంపెనీ Xiaomi త్వరలోనే గ్లోబల్ గా Xiaomi 13 Lite 5G ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఫిబ్రవరి 26 న జరిగే ఈవెంట్ లో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా Xiaomi 13 Lite 5G కి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియో, కలర్ ఆప్షన్స్, డిజైన్ బయటకు వచ్చాయి.

Xiaomi 13 Lite 5G డివైజ్ 4 కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఇంకా ఈ ఫోన్ Xiaomi Civi 2 ఫోన్ కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని కన్ఫర్మ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 6.55-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో రానుంది.

Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో

టిప్‌స్టర్ శుభ్‌మన్ అంభోరే Xiaomi 13 Lite 5G యొక్క అన్‌బాక్సింగ్ వీడియోను షేర్ చేశాడు. అలాగే స్పెసిఫికేషన్స లిస్ట్ ని కూడా పోస్ట్ చేశాడు. ఓసారి ఆ వీడియోని ఇక్కడ చూడండి.

Xiaomi 13 Lite 5G స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Lite 5G స్మార్ట్ ఫోన్ ziyi అనే కోడ్ నేమ్ తో గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా Xiaomi 13 Lite 5G స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Xiaomi 13 Lite 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 8జిబి ర్యామ్ కలిగి ఉంటుంది. లిస్టింగ్ ని గమనిస్తే Xiaomi 13 Lite 5G డివైజ్ Xiaomi Civi 2 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అనిపిస్తోంది.

Xiaomi 13 Lite 5G స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి. పిల్-షేప్డ్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Xiaomi 13 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 20ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 13 Lite 5G లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండదు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఉంటుంది. Xiaomi 13 Lite 5G హ్యాండ్సెట్ లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్ సెటప్ తో వస్తోంది. Xiaomi 13 Lite 5G ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Video: Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>
32MP + 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయిన Xiaomi Civi 2 https://www.91mobiles.com/telugu/xiaomi-civi-2-launched-china-specs-price/ Wed, 28 Sep 2022 11:07:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=2619 హైలైట్స్: Xiaomi Civi 2 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన షావోమీ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 32ఎంపి + 32ఎంపి సెల్ఫీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ప్రస్తుతం చైనా మార్కెట్ కే పరిమితం కానున్న Xiaomi Civi 2, త్వరలో గ్లోబల్ మార్కెట్స్ కి విస్తరించే అవకాశం ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ, Xiaomi Civi 2 అనే స్మార్ట్ ఫోన్ […]

The post 32MP + 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయిన Xiaomi Civi 2 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Xiaomi Civi 2 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన షావోమీ
  • స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 32ఎంపి + 32ఎంపి సెల్ఫీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • ప్రస్తుతం చైనా మార్కెట్ కే పరిమితం కానున్న Xiaomi Civi 2, త్వరలో గ్లోబల్ మార్కెట్స్ కి విస్తరించే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ, Xiaomi Civi 2 అనే స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Xiaomi Civi 2 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi Civi 2 ధర, స్పెసిఫికేషన్స్

Xiaomi Civi 2 లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 402 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి. Xiaomi Civi 2 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 12 ఆధారంగా పని చేస్తుంది. ఇక ఈ ఫోన్లో క్వాల్కమ్ కంపెనీ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ని అమర్చారు. ఈ చిప్ 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది. అలాగే ఇది 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్. Xiaomi Civi 2 లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు.

Xiaomi Civi 2 డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ కనెక్టివిటీ కలిగి ఉంది. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi Civi 2 లో వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీని వాడారు. దీని వల్లన గేమ్స్ ఆడేప్పుడు నిరవధికంగా వీడియోలు చూసేప్పుడు ఫోన్ వేడెక్కదు.

ఇప్పుడు Xiaomi Civi 2 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi Civi 2 లో 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ రెండు కెమెరాలు డిస్ప్లే పై పిల్ షేప్ నాచ్ ని ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు కెమెరాల్లో ఒకటి 100 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన వైడ్ యాంగిల్ కెమెరా.

Xiaomi Civi 2 రియర్ కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 20ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

Xiaomi Civi 2 చైనాలో మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ అయిన 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 2,399 (దాదాపు రూ.27,299) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజీ యూనిట్ ధర RMB 2,499 (దాదాపు రూ.28,500) గా నిర్ణయించారు. ఇక 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ గల టాప్ వేరియంట్ ధర RMB 2,799 (దాదాపు రూ.31,900) గా ఉంది. Xiaomi Civi 2 బ్లాక్, బ్లూ, సిల్వర్, పింక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 32MP + 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయిన Xiaomi Civi 2 first appeared on 91Mobiles Telugu.

]]>