32MP + 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయిన Xiaomi Civi 2

హైలైట్స్:

  • Xiaomi Civi 2 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన షావోమీ
  • స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 32ఎంపి + 32ఎంపి సెల్ఫీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • ప్రస్తుతం చైనా మార్కెట్ కే పరిమితం కానున్న Xiaomi Civi 2, త్వరలో గ్లోబల్ మార్కెట్స్ కి విస్తరించే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ, Xiaomi Civi 2 అనే స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Xiaomi Civi 2 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi Civi 2 ధర, స్పెసిఫికేషన్స్

Xiaomi Civi 2 లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 402 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి. Xiaomi Civi 2 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 12 ఆధారంగా పని చేస్తుంది. ఇక ఈ ఫోన్లో క్వాల్కమ్ కంపెనీ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ని అమర్చారు. ఈ చిప్ 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది. అలాగే ఇది 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్. Xiaomi Civi 2 లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు.

Xiaomi Civi 2 డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ కనెక్టివిటీ కలిగి ఉంది. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi Civi 2 లో వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీని వాడారు. దీని వల్లన గేమ్స్ ఆడేప్పుడు నిరవధికంగా వీడియోలు చూసేప్పుడు ఫోన్ వేడెక్కదు.

ఇప్పుడు Xiaomi Civi 2 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi Civi 2 లో 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ రెండు కెమెరాలు డిస్ప్లే పై పిల్ షేప్ నాచ్ ని ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు కెమెరాల్లో ఒకటి 100 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన వైడ్ యాంగిల్ కెమెరా.

Xiaomi Civi 2 రియర్ కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 20ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

Xiaomi Civi 2 చైనాలో మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ అయిన 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 2,399 (దాదాపు రూ.27,299) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజీ యూనిట్ ధర RMB 2,499 (దాదాపు రూ.28,500) గా నిర్ణయించారు. ఇక 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ గల టాప్ వేరియంట్ ధర RMB 2,799 (దాదాపు రూ.31,900) గా ఉంది. Xiaomi Civi 2 బ్లాక్, బ్లూ, సిల్వర్, పింక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleరూ.11,799 ధరతో లాంచ్ అయిన Nokia T10 Tablet
Next articleFlipkart లో ల్యాప్ టాప్ ఆర్డర్ పెడితే బట్టలు ఉతికే సబ్బులు వచ్చాయి..!!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.