Xiaomi MIX Flip - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 27 Sep 2024 10:19:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Xiaomi MIX Flip: 12GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన షావోమి మిక్స్ ఫ్లిప్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-globally-launched-12gb-ram-know-full-details/ https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-globally-launched-12gb-ram-know-full-details/#respond Fri, 27 Sep 2024 10:19:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13802 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Xiaomi MIX Flip పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఇది షావోమి యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్. ఈ ఫోన్ 4-ఇంచ్ భారీ కవర్ స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. […]

The post Xiaomi MIX Flip: 12GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన షావోమి మిక్స్ ఫ్లిప్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Xiaomi MIX Flip లాంచ్
  • 4-ఇంచ్ కవర్ డిస్ప్లే
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Xiaomi MIX Flip పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఇది షావోమి యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్. ఈ ఫోన్ 4-ఇంచ్ భారీ కవర్ స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఓసారి ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Xiaomi MIX Flip ధర, లభ్యత

Xiaomi MIX Flip స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర 1299 యూరోలు (సుమారు రూ.1,21,000) గా ఉంది.

ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం యూరప్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఇతర మార్కెట్స్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.

Xiaomi MIX Flip డివైజ్ బ్లాక్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Xiaomi MIX Flip స్పెసిఫికేషన్స్

ఇంటర్నల్ స్క్రీన్: Xiaomi MIX Flip లో 6.86-ఇంచ్ ఎల్టీపీవో 1.5కే క్రిస్టల్‌రెజ్ డిస్ప్లే, 2912*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్, 3000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్, యూటీజీ గ్లాస్ ఉన్నాయి.

ఔటర్ డిస్ప్లే: Xiaomi MIX Flip లో 4-ఇంచ్ 1.5కే క్రిస్టల్‌రెజ్ స్క్రీన్, 1392*1280 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్, 3000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, షావోమి గ్లాస్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

చిప్సెట్: Xiaomi MIX Flip లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ ఇచ్చారు.

ర్యామ్, స్టోరేజీ: Xiaomi MIX Flip డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వచ్చింది.

కెమెరా: Xiaomi MIX Flip లో 50ఎంపి లైట్ ఫ్యూజన్ 800 ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి60ఏ40 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Xiaomi MIX Flip లో పవర్ బ్యాకప్ కోసం 4780 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Xiaomi MIX Flip డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Xiaomi MIX Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.4 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Xiaomi MIX Flip డివైజ్ 167.5 మి.మీ పొడవు, 74.02 మి.మీ వెడల్పు, 16.19 మి.మీ మందం (మడిచినప్పుడు), 7.8 మి.మీ మందం (తెరిచినప్పుడు), 192 గ్రాముల బరువు ఉంటుంది.

The post Xiaomi MIX Flip: 12GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన షావోమి మిక్స్ ఫ్లిప్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-globally-launched-12gb-ram-know-full-details/feed/ 0
Xiaomi: చైనాలో లాంచైన MIX Fold 4, MIX Flip https://www.91mobiles.com/telugu/xiaomi-mix-fold-4-xiaomi-mix-flip-launched-in-china/ https://www.91mobiles.com/telugu/xiaomi-mix-fold-4-xiaomi-mix-flip-launched-in-china/#respond Fri, 19 Jul 2024 18:21:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=12586 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi తన హోమ్ మార్కెట్ చైనాలో MIX Fold 4, MIX Flip ఫోల్డబుల్ ఫోన్లను నేడు లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్ కే పరిమితం కానున్నాయి. భారత్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయా? లేదా? అనే విషయం ఇంకా తెలియదు. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం MIX Fold 4, MIX Flip […]

The post Xiaomi: చైనాలో లాంచైన MIX Fold 4, MIX Flip first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో MIX Fold 4, MIX Flip లాంచ్
  • ఓఎల్ఈడీ ప్యానెల్, 3000 నిట్స్ బ్రైట్నెస్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi తన హోమ్ మార్కెట్ చైనాలో MIX Fold 4, MIX Flip ఫోల్డబుల్ ఫోన్లను నేడు లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్ కే పరిమితం కానున్నాయి. భారత్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయా? లేదా? అనే విషయం ఇంకా తెలియదు. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం MIX Fold 4, MIX Flip ఫోల్డబుల్ ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Xiaomi MIX Fold 4 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Xiaomi MIX Fold 4 లో 6.56-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్ ఔటర్ డిస్ప్లే, 7.98-ఇంచ్ ఇన్నర్ స్క్రీన్, 2488*2224 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, హెచ్డీఆర్ వివిడ్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి.

చిప్సెట్: Xiaomi MIX Fold 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. అల్ట్రా-థిన్ వీసీ సిస్టమ్ ఇందులో అందించారు.

రియర్ కెమెరా: Xiaomi MIX Fold 4 లో లైకా బ్రాండెడ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ 800 ఓఐఎస్ కెమెరా + 12ఎంపి అల్ట్రావైడ్ ఒవి13బి10 లెన్స్ + 50ఎంపి టెలీఫోటో ఒవి60ఏ40 3ఎక్స్ జూమ్ కెమెరా, 10ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో శాంసంగ్ ఎస్5కే3కే1 5ఎక్స్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: Xiaomi MIX Fold 4 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఒమ్నివిజన్ ఒవి16ఎఫ్40 కెమెరాను ఇంటర్నల్ స్క్రీన్ పై అందించారు. ఎక్స్‌టర్నల్ డిస్ప్లేపై 20ఎంపి ఒమ్నివిజన్ ఒవి16ఎఫ్40 లెన్స్ ఇచ్చారు.

బ్యాటరీ: Xiaomi MIX Fold 4 లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ వైర్డ్ మరియు 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Xiaomi MIX Fold 4 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Xiaomi MIX Fold 4 లో వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్లు, టూ-వే శాటిలైట్ కనెక్టివిటీ, ఐపీఎక్స్8 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

Xiaomi MIX Flip స్పెసిఫికేషన్స్

ఇంటర్నల్ డిస్ప్లే: Xiaomi MIX Flip లో 6.86-ఇంచ్ ఫోల్డబుల్ ఓఎల్ఈడీ టీసీఎల్ సీ8+ ఎల్టీపీవో స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (2912*1224 పిక్సెల్స్) రెజుల్యూషన, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఎక్స్‌టర్నల్ స్క్రీన్: Xiaomi MIX Flip లో 4.01-ఇంచ్ ఓఎల్ఈడీ టీసీఎల్ సీ8+, 1392*1208 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, షావోమి డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi MIX Flip లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీ అందించారు.

కెమెరా: Xiaomi MIX Flip లో 50ఎంపి ఒమ్నివిజన్ 800 ఓఐఎస్ లెన్స్, 50ఎంపి ఒవి60ఏ4 టెలీఫోటో 2ఎక్స్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్816 కెమెరా ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: Xiaomi MIX Flip డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Xiaomi MIX Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,780 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Xiaomi: చైనాలో లాంచైన MIX Fold 4, MIX Flip first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-mix-fold-4-xiaomi-mix-flip-launched-in-china/feed/ 0
Xiaomi MIX Flip: గీక్‌బెంచ్‌పై కనిపించిన షావోమి మిక్స్ ఫ్లిప్ https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-listed-on-geekbench/ https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-listed-on-geekbench/#respond Mon, 15 Jul 2024 17:21:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=12526 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi MIX Flip పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్‌పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Xiaomi MIX Flip గీక్‌బెంచ్ లిస్టింగ్ Xiaomi MIX Flip ఫోల్డబుల్ ఫోన్ గీక్‌బెంచ్‌పై 2405CPX3DC అనే […]

The post Xiaomi MIX Flip: గీక్‌బెంచ్‌పై కనిపించిన షావోమి మిక్స్ ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi MIX Flip లాంచ్
  • జులై ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం
  • మోడల్ నంబర్ 240CPX3DC

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi MIX Flip పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్‌పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi MIX Flip గీక్‌బెంచ్ లిస్టింగ్

Xiaomi MIX Flip ఫోల్డబుల్ ఫోన్ గీక్‌బెంచ్‌పై 2405CPX3DC అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2087 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 6282 పాయింట్లు నమోదు చేసింది.

Xiaomi MIX Flip ఫోల్డబుల్ ఫోన్ 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఆక్టా-కోర్ చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్ పై ఉన్న వివరాలను బట్టి, Xiaomi MIX Flip ఫోల్డబుల్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలె Xiaomi MIX Flip డివైజ్ ఎన్‌సీసీ సర్టిఫికేషన్ పై కనిపించింది. దీని ద్వారా ఈ ఫోన్ లో కవర్ డిస్ప్లే పై నిలువుగా రెండు కెమెరాలు ఉంటాయని అర్థమైంది. Xiaomi MIX Flip లోని ఇన్నర్ డిస్ప్లేపై సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉంటుందని సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది.

Xiaomi MIX Flip స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 1145mAh+3595mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయిని లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. జులై ఆఖర్లో Xiaomi MIX Flip డివైజ్ లాంచ్‌ ఉంటుంది.

The post Xiaomi MIX Flip: గీక్‌బెంచ్‌పై కనిపించిన షావోమి మిక్స్ ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-listed-on-geekbench/feed/ 0
Xiaomi Mix Flip: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన షావోమి మిక్స్ ఫ్లిప్ https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-listed-on-nbtc-website/ Tue, 11 Jun 2024 14:50:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=12001 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో ఫ్లిప్ ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi Mix Flip పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. గత నెలలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎన్బీటీసీ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. రానున్న కొన్ని వారాల్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఓసారి Xiaomi Mix Flip యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. Xiaomi Mix Flip […]

The post Xiaomi Mix Flip: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన షావోమి మిక్స్ ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi Mix Flip లాంచ్
  • మోడల్ నంబర్ 2405CPX3DG
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో ఫ్లిప్ ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi Mix Flip పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. గత నెలలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎన్బీటీసీ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. రానున్న కొన్ని వారాల్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఓసారి Xiaomi Mix Flip యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

Xiaomi Mix Flip ఎన్బీటీసీ లిస్టింగ్

Xiaomi Mix Flip స్మార్ట్‌ఫోన్ 2405CPX3DG అనే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ సైట్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు Xiaomi Mix Flip అని కన్ఫర్మ్ అయ్యింది. లిస్టింగ్ లో పేరుని గమనించవచ్చు.

ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ లిస్టింగ్ ద్వారా రివీలైన వివరాలు ఇవే. త్వరలోనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Xiaomi Mix Flip డిజైన్

లీక్ ప్రకారం, Xiaomi Mix Flip డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై కవర్ స్క్రీన్ ఉంటుందని తెలుస్తోంది.

లీకైన ఇమేజ్ ని గమనిస్తే, డ్యూయల్ కెమెరా మాడ్యూల్ మరియు రెండు ఎల్ఈడీ ఫ్లాషెస్ కవర్ డిస్ప్లే పై కనిపిస్తున్నాయి.

కెమెరా మాడ్యూల్ పై లైకా లోగో కనిపిస్తోంది. ఇకపోతే, సగం వరకు బ్యాక్ ప్యానెల్ గోల్డెన్ ఫినిష్ తో ఉంది. అలాగే బాటమ్ లో షావోమి బ్రాండింగ్ ఉంది.

Xiaomi Mix Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi Mix Flip డివైజ్ 1.5కే రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు.

ఈ ఫ్లిప్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi Mix Flip ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 60ఎంపి ఒమ్నివిజన్ ఒవి60ఏ 1/2.8-ఇంచ్ సెన్సర్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ సెన్సర్ ఉంటాయి.

Xiaomi Mix Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Xiaomi Mix Flip 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.

The post Xiaomi Mix Flip: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన షావోమి మిక్స్ ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్! https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-listed-on-miit-website-with-satellite-connectivity/ Thu, 18 Jan 2024 15:29:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9790 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ఫోన్ Xiaomi Mix Flip అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Xiaomi Mix Flip ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి లిస్టింగ్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi Mix Flip
  • శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న డివైజ్
  • MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన Xiaomi Mix Flip

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ఫోన్ Xiaomi Mix Flip అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Xiaomi Mix Flip ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి లిస్టింగ్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi Mix Flip ఎంఐఐటీ లిస్టింగ్

  • Xiaomi Mix Flip ఫోల్డబుల్ ఫోన్ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై 2311BPN23C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ ప్రకారం, Xiaomi Mix Flip డివైజ్ శాటిలైట్ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Xiaomi Mix Flip కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ఏవీ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.
  • Xiaomi Mix Flip ఫోల్డబుల్ ఫోన్ చైనాలో జులై లేదా ఆగస్టు నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి కూడా ప్రవేశించనుంది.

Xiaomi Mix Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • ప్రాసెసర్: Xiaomi Mix Flip లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Xiaomi Mix Flip లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒక 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది.
  • కనెక్టివిటీ: Xiaomi Mix Flip లో 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • డిజైన్: Xiaomi Mix Flip డివైజ్ తేలికగా, సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ Samsung Galaxy Z Flip 5, Motorola Razr 40, Oppo Find N3 Flip వంటి ఫోల్డబుల్ ఫోన్లతో పోటీపడనుంది.

The post Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
IMEI సర్టిఫికేషన్ సైట్ లో కనిపించిన Xiaomi MIX Flip https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-spotted-imei-certification-site/ Wed, 06 Sep 2023 05:53:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=7875 ఇటీవలె చైనాలో జరిగిన ప్రొడక్ట్ ఈవెంట్ లో షావోమి కంపెనీ పలు ఉత్పత్తులను లాంచ్ చేసింది. షావోమి నుంచి Xiaomi mix Fold 3, Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max వంటి ఇతర ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వచ్చాయి. Xiaomi Mix Fold 3 గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కాదని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇదిలా ఉండగా, ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్.. ప్రస్తుతం షావోమి Xiaomi MIX Flip […]

The post IMEI సర్టిఫికేషన్ సైట్ లో కనిపించిన Xiaomi MIX Flip first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫ్లిప్ ఫోన్ పై పని చేస్తున్న Xiaomi సంస్థ
  • త్వరలో లాంచ్ కానున్న ఫోల్డబుల్ డివైజ్
  • తాజాగా ఐఎంఈఐ సైట్ పై కనిపించిన Xiaomi MIX Flip

ఇటీవలె చైనాలో జరిగిన ప్రొడక్ట్ ఈవెంట్ లో షావోమి కంపెనీ పలు ఉత్పత్తులను లాంచ్ చేసింది. షావోమి నుంచి Xiaomi mix Fold 3, Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max వంటి ఇతర ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వచ్చాయి. Xiaomi Mix Fold 3 గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కాదని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇదిలా ఉండగా, ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్.. ప్రస్తుతం షావోమి Xiaomi MIX Flip పై పని చేస్తున్నట్లు వెల్లడించింది.

టిప్‌స్టర్ తెలిపిన Xiaomi MIX Flip సమాచారం

షావోమి ప్రస్తుతం N17 అనే కోడ్ నంబర్ గల కొత్త స్మార్ట్ ఫోన్స్ సిరీస్ పై పని చేస్తున్నట్లు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. తాజాగా సదరు టిప్‌స్టర్ Xiaomi MIX Flip డివైజ్ ని ఐఎంఈఐ లిస్టింగ్ పై గుర్తించింది. దీంతో డివైజ్ యొక్క మోడల్ నంబర్, మానికర్ రివీల్ అయ్యాయి. లిస్టింగ్ పై Xiaomi MIX Flip డివైజ్ 2311BPN23C అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్ యొక్క IMEI జాబితా రాబోయే MIX ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇతర స్పెసిఫికేషన్‌లను బయటపెట్టలేదు. Xiaomi సంస్థ నుంచి రాబోవు ఫ్లిప్ ఫోన్, ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Samsung Galaxy Z Flip 5, Motorola Razr 40 మరియు ఇతర క్లామ్‌షెల్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడనుంది. Xiaomi కంపెనీ MIX Flip మరియు MIX Fold 4 స్మార్ట్‌ఫోన్‌లను 2024లో విడుదల చేయవచ్చని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.

ఈ సరికొత్త షావోమి ఫ్లిప్‌ ఫోన్ Qualcomm Snapdragon సిరీస్ చిప్‌సెట్‌లతో రానుందని టిప్‌స్టర్ ధృవీకరించారు. GSMchina రాబోయే క్లామ్‌షెల్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్కీమాటిక్ రెండర్‌ను షేర్ చేసింది. Xiaomi స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తాజా నివేదిక పేర్కొంది. సరే, ఓసారి ఇటీవలె లాంచైన Xiaomi Fold 3 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Xiaomi Fold 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Xiaomi Fold 3 లో 8.03-ఇంచ్ ఫోల్డబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రెజుల్యూషన్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6.56-ఇంచ్ కవర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi Fold 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi Fold 3 లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi Fold 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Xiaomi Fold 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi Fold 3 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 10ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ (3.2x ఆప్టికల్ జూమ్), 10ఎంపి ఓఐఎస్ పెరిస్కోప్ లెన్స్ (5x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: Xiaomi Fold 3 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్ 596 సెన్సర్ ఉంది.
  • బ్యాటరీ: Xiaomi Fold 3 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇది 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi Fold 3 డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post IMEI సర్టిఫికేషన్ సైట్ లో కనిపించిన Xiaomi MIX Flip first appeared on 91Mobiles Telugu.

]]>