Xiaomi: శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న Xiaomi Mix Flip, MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన డివైజ్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi Mix Flip
  • శాటిలైట్ కనెక్టివిటీతో రానున్న డివైజ్
  • MIIT వెబ్‌సైట్‌లో లిస్టైన Xiaomi Mix Flip

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ఫోన్ Xiaomi Mix Flip అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Xiaomi Mix Flip ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి లిస్టింగ్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi Mix Flip ఎంఐఐటీ లిస్టింగ్

  • Xiaomi Mix Flip ఫోల్డబుల్ ఫోన్ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై 2311BPN23C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ ప్రకారం, Xiaomi Mix Flip డివైజ్ శాటిలైట్ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Xiaomi Mix Flip కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ఏవీ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.
  • Xiaomi Mix Flip ఫోల్డబుల్ ఫోన్ చైనాలో జులై లేదా ఆగస్టు నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి కూడా ప్రవేశించనుంది.

Xiaomi Mix Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • ప్రాసెసర్: Xiaomi Mix Flip లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Xiaomi Mix Flip లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒక 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది.
  • కనెక్టివిటీ: Xiaomi Mix Flip లో 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • డిజైన్: Xiaomi Mix Flip డివైజ్ తేలికగా, సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ Samsung Galaxy Z Flip 5, Motorola Razr 40, Oppo Find N3 Flip వంటి ఫోల్డబుల్ ఫోన్లతో పోటీపడనుంది.
Previous articleRealme: Geekbench పై లిస్టైన Realme 12 Pro Plus
Next articleTECNO: Geekbench పై లిస్టైన Tecno Phantom V2 Fold 5G; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.