Zee5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 13 Aug 2023 17:56:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) https://www.91mobiles.com/telugu/best-telugu-films-on-ott-2023/ Sun, 13 Aug 2023 17:52:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7525 ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ […]

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>

ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ సంస్థలు అంత ఈజీగా కొనడం లేదు. అంతేకదా, సినిమాలో దమ్ము లేకపోతే ఓటీటీల్లో అయినా ఏ ప్రేక్షకుడు చూస్తాడు చెప్పండి?

సరే, విషయంలోకి వద్దాం. 2023 లో విడుదలై ప్రస్తుతం ఓటీటీల్లో బాగా అలరిస్తోన్న తెలుగు సినిమాలేవో ఇక్కడ తెలుసుకుందాం. ఈ జాబితాలో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, నాని నటించిన దసరా, నాగ శౌర్య ‘రంగబలి’ వంటి ఎన్నో చిత్రాలున్నాయి. సరే, పదండి మరి ఆ జాబితాపై ఓ లుక్ వేద్దాం.

Best Telugu Films On Netflix (2023)

రంగబలి

రంగబలి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో చూసేందుకు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నాగశౌర్య, యుక్తి తరేజా ప్రధాన పాత్రలు పోషించారు.

  • సినిమా పేరు: రంగబలి
  • ఐఎండీబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాగశౌర్య, యుక్తి తరేజా
  • విడుదల తేదీ – 7 జులై 2023

వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జనవరి 12 న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వాల్తేరు వీరయ్య
  • ఐఎండిబి రేటింగ్– 6.2/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – చిరంజీవి, రవితేజ, శృతిహాసన్
  • విడుదల తేదీ – 12 జనవరి 2023

దసరా

దసరా చిత్రంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం 2023 మార్చి 30 న థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: దసరా
  • ఐఎండిబి రేటింగ్ – 6.7/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాని, కీర్తి సురేశ్
  • విడుదల తేదీ – 30 మార్చి 2023

Best Telugu Films On Amazon Prime (2023)

ఆదిపురుష్

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. రామాయణ గాథను స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2023 జూన్ 16 న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: ఆదిపురుష్
  • ఐఎండీబి రేటింగ్ – 3.2/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – ప్రభాస్, కృతీసనన్
  • విడుదల తేదీ – 16 జూన్ 2023

రుద్రాంగి

జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రాంగి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విభిన్న నేపథ్యం ఉన్న చిత్రాన్ని చూడాలనుకుంటే రుద్రాంగి ని చూసేయండి.

  • సినిమా పేరు: రుద్రాంగి
  • ఐఎమ్‌డిబి రేటింగ్ – 7.3/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – జగపతి బాబు, మమతా మోహన్ దాస్
  • విడుదల తేదీ – 7 July 2023

స్పై

నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై సినిమా 2023 జూన్ 29 న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: స్పై
  • ఐఎండిబి రేటింగ్ – 5.4/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్
  • విడుదల తేదీ – 29 జూన్ 2023

రావణాసుర

రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించిన రావణాసుర చిత్రం 2023 ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రావణాసుర
  • ఐఎండిబి రేటింగ్र – 5.7/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్
  • నటీనటులు – రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా
  • విడుదల తేదీ – 7 ఏప్రిల్ 2023

Best Telugu Films on Disney+ Hotstar (2023)

వీరసింహారెడ్డి

వీరసింహారెడ్డి చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 జనవరి 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వీర సింహారెడ్డి
  • ఐఎండిబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్
  • విడుదల తేదీ – 11 జనవరి 2023

బిచ్చగాడు 2

బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్ ఆంటోని, కావ్యా తాపర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023 మే 19 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: బిచ్చగాడు 2
  • ఐఎండిబి రేటింగ్ – 5.6/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – విజయ్ ఆంటోని, కావ్యా తాపర్
  • విడుదల తేదీ – 19 మే 2023

Best Telugu Films on Sony Liv (2023)

పరేషాన్

పరేషాన్ చిత్రంలో తిరువీర్, పావని కరణం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోని లివ్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జూన్ 2 వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: పరేషాన్
  • ఐఎండిబి రేటింగ్ – 6.1/10
  • ఎక్కడ చూడాలి – సోని లివ్
  • నటీనటులు – తిరువీర్, పావని కరణం
  • విడుదల తేదీ – 2 June 2023

Best Telugu Films On Zee5 (2023)

రైటర్ పద్మభూషణ్

రైటర్ పద్మభూషణ్ చిత్రంలో సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 ఫిబ్రవరి 3 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. జీ5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రైటర్ పద్మభూషణ్
  • ఐఎండిబి రేటింగ్ – 7.7/10
  • ఎక్కడ చూడాలి – జీ5
  • నటీనటులు – సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ
  • విడుదల తేదీ – 3 ఫిబ్రవరి 2023

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>
ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే https://www.91mobiles.com/telugu/four-telugu-films-streaming-on-ott-today/ Fri, 09 Dec 2022 09:38:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3903 హైలైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా […]

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు
  • ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు
  • సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా

శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా పెరిగింది. దీంతో థియేటర్లలో సినిమాలను మిస్ అయ్యే వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం పదండి.

1.మాచర్ల నియోజకవర్గం
2.యశోద
3.ఊర్వశివో రాక్షసివో
4.లైక్-షేర్ & సబ్‌స్క్రైబ్

1.మాచర్ల నియోజకవర్గం

నితిన్, కృతిశెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా కనిపించారు. పొలిటికల్ త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. అయితే కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

2.యశోద

సమంతా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవలె థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ, తర్వాత అదే ఊపుని కొనసాగించలేకపోయింది. దీంతో త్వరగానే థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సమంతా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాల్లో కూడా నటించి మెప్పించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, దివ్య శ్రీపాద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరి-హరీశ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శివలెంక కే ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

3.ఊర్వశివో రాక్షసివో

ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి నుంచి ఆహా ఓటీటీ తో పాటు, నెట్‌ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. వివాహం గొప్పదా లేక లివ్-ఇన్ రిలేషన్షిప్ బెటరా? అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించారు.

4.లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్

ఈ చిత్రంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాము తూము ఎడిటింగ్ చేశాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

మరింకేంటి, ఈ 4 తెలుగు సినిమాలని చూసేసి ఈ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
Zee5 లో అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు https://www.91mobiles.com/telugu/allu-arjun-movies-on-zee5-ott-platform/ Tue, 22 Nov 2022 12:14:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=3584 ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. మరొక విషయం ఏంటంటే, ఉత్తరాదిన కూడా బన్నీకి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టైలిష్ స్టార్ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఎనలేని క్రేజ్ ఉంది. హిందీలోకి అనువదించబడిన బన్నీ చిత్రాలు ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప తో అల్లు అర్జున్ ఇటు సౌత్, అటు నార్త్ […]

The post Zee5 లో అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. మరొక విషయం ఏంటంటే, ఉత్తరాదిన కూడా బన్నీకి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టైలిష్ స్టార్ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఎనలేని క్రేజ్ ఉంది. హిందీలోకి అనువదించబడిన బన్నీ చిత్రాలు ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప తో అల్లు అర్జున్ ఇటు సౌత్, అటు నార్త్ లో ప్రభంజనం సృష్టించారు. ఉత్తరాది ప్రేక్షకులు పుష్ప చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేరళ లో బన్నీ స్టార్డమ్ గురించే మరి. ఎందుకుంటే మనోడికి అక్కడ ఆర్య సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది.

సరే, ప్రస్తుతం మ్యాటర్ లోకి వద్దాం. ఇటీవలి కాలంలో ఓటీటీ లు జనాలకు అమితమైన వినోదాన్ని పంచుతున్నాయి. తమ అభిమాన నటుల చిత్రాలను ఇంట్లో కూర్చొని తమకు కవాల్సినప్పుడల్లా ఓటీటీ లో చూస్తూ ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. మరి ZEE5 ఓటీటీలో అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ చిత్రాలేంటో తెలుసుకుందాం పదండి.

ZEE5 లో అల్లు అర్జున్ సినిమాలు ఇవే

  •  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
  •  Dj దువ్వాడ జగన్నాథమ్
  •  ఇద్దరమ్మాయిలతో

 

1. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)

అనుమానమే అక్కర్లేదు. ఇది కచ్చితంగా అల్లు అర్జున్ నటించిన ఉత్తమ చిత్రాల్లో ఒకటి. ఆవేశంలో ఊగిపోయే జవాను పాత్రలో అల్లు అర్జున్ నటన అద్భుతమని చెప్పాలి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. కానీ, ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. సినిమా కోసం అల్లు అర్జున్ తనని తాను పూర్తిగా సోల్జర్ గా మార్చుకున్న తీరు ఎక్స్‌లెంట్ అని చెప్పాలి. వెండితెరపై చూస్తుంటే, నిజంగా ఒక సైనికుడే కనిపిస్తాడు. అంతలా బన్నీ తన పాత్రలో జీవించారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా బన్నీ అభిమానులు మాత్రం కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. జీ5 లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ఓసారి చూసేయండి మరి.

2. Dj- దువ్వాడ జగన్నాథమ్ (2017)

ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో ఉండే రోల్ తో పాటు, బ్రాహ్మణుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. దువ్వాడ జగన్నాథం శాస్త్రి అనే వంటవాడి పాత్రలో కనిపిస్తూ హాస్యాన్ని పంచిన బన్నీ, మరోవైపు డీజే అనే పేరుతో స్టైలిష్ గా కనిపిస్తూ విలన్స్ ని మట్టుపెడుతుంటారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా చేసింది. రొయ్యల నాయుడిగా విలన్ పాత్రలో రావు రమేశ్ మెప్పించారు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. దువ్వాడ జగన్నాథం చిత్రం జీ5 లో అందుబాటులో ఉంది.

3. ఇద్దరమ్మాయిలతో (2013)

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇద్దరమ్మాయిలతో చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ప్రత్యేకించి ఫైట్స్ ఎంతో స్టైలిష్ గా తెరకెక్కించారు. బన్నీ కూడా తనదైన శైలిలో పోరాట సన్నివేశాల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రంలో సంజు రెడ్డి అనే గిటారిస్ట్ గా అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమాలో అమలా పాల్, కేథరిన్ ట్రెసా కథానాయికలుగా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం జీ5 లో అందుబాటులో ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Zee5 లో అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>
OTT లో స్ట్రీమ్ అవుతోన్న రాజ్ తరుణ్ నటించిన వెబ్ సిరీస్ Aha Naa Pellanta https://www.91mobiles.com/telugu/aha-naa-pellanta-web-series-starring-raj-tarun-shivani-rajashekar-streaming-on-zee-5-ott/ Sat, 19 Nov 2022 03:35:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=3542 హైలైట్స్ అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్ జీ5 ఓటీటీ లో ప్రసారమవుతోన్న అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో పోషించిన రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓటీటీ బాట పట్టాడు. ఇన్నాళ్ళు సినిమాలతో వెండితెర ప్రేక్షకులకు వినోదం పంచిన రాజ్ తరుణ్, ఇప్పుడు అహ నా పెళ్ళంట అనే వెబ్ […]

The post OTT లో స్ట్రీమ్ అవుతోన్న రాజ్ తరుణ్ నటించిన వెబ్ సిరీస్ Aha Naa Pellanta first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్
  • జీ5 ఓటీటీ లో ప్రసారమవుతోన్న అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్
  • ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో పోషించిన రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓటీటీ బాట పట్టాడు. ఇన్నాళ్ళు సినిమాలతో వెండితెర ప్రేక్షకులకు వినోదం పంచిన రాజ్ తరుణ్, ఇప్పుడు అహ నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టెయిన్ చేసేందుకు వచ్చేశాడు. రాజ్ తరుణ్ ప్రధాన పాత్ర పోషించిన అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి.

వెబ్‌సిరీస్ కథ

పెళ్ళిపీటలపై నుంచి పెళ్ళి కూతురు తన ఎక్స్-బాయ్‌ఫ్రెండ్ తో కలిసి లేచి పోతుంది. పాపం మరోవైపు పెళ్ళి కొడుకు, వధువు కోసం మండపంలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక చేసేదేముంది. తనను పెళ్ళి చేసుకోకుండా పారిపోయిన అమ్మాయిపై వరుడు రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోవడంతో అసలు కథ షురూ అవుతుంది. ఇక తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే మీరు జీ5 లో ప్రసారమయ్యే అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉంది?

అహ నా పెళ్ళంట సరదాగా సాగిపోయే ఒక రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. మొదటి ఎపిసోడ్ ఆద్యంతం ఫన్నీగా సాగిపోతుంది. రెండు, మూడు ఎపిసోడ్స్ కాస్త స్లో అయినప్పటికీ తర్వాత ఎపిసోడ్స్ పుంజుకుంటాయి. రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. లవ్, ఎమోషన్స్, కామెడీ అన్నీ బ్యాలన్స్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వెబ్ సిరీస్ లా కాకుండా ఓ సినిమా చూస్తున్న అనుభూతి కల్గుతుంది.

ఎలా చేశారు?

నటీనటులు బాగా చేశారు. ఎవ్వరూ మైనస్ గా కనిపించలేదు. రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ తమ పాత్రల్లో జీవించారు. హర్షవర్ధన్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. కామెడీ, ఎమోషన్ అన్ని సన్నివేశాలను రక్తిగట్టించారు. సిరీస్ కి ఆయన కూడా ఓ ప్లస్ పాయింట్. ఆమని, పోసాని కృష్ణమురళి కూడా బాగా చేశారు.

దర్శకుడు సంజీవ్ రెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో మెప్పించాడు. కామెడీ, రొమాన్స్ తో పాటు అన్ని ఎమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు. సిరీస్ ఆద్యాంతం బోర్ కొట్టకుండా బాగా తీసుకెళ్ళాడు. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి.

అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ కి జుడా శాండీ సంగీతం అందించగా, పవన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చాడు. నగేశ్ బన్నెల్, ఆష్కర్ అలీ సినిమాటోగ్రఫర్స్ గా చేశారు. కథ, స్క్రీన్ ప్లే షేక్ దావూద్ అందించాడు. కళ్యాణ్ రాఘవ్ మాటలు రాశాడు. సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు.

2022 నవంబర్ 17 నుంచి అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ లో ప్రసారమవుతోంది. వినోదమంటేనే ఒత్తిడిని తగ్గించే మెడిసిన్. మరింకేంటి, అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ చూస్తూ కాసేపు హాయిగా నవ్వుకుని రిలాక్స్ అవ్వండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OTT లో స్ట్రీమ్ అవుతోన్న రాజ్ తరుణ్ నటించిన వెబ్ సిరీస్ Aha Naa Pellanta first appeared on 91Mobiles Telugu.

]]>
నిఖిల్ నటించిన కార్తికేయ 2 OTT అప్డేట్ https://www.91mobiles.com/telugu/karthikeya-2-movie-ott-update/ Wed, 17 Aug 2022 15:51:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=1743 హైలైట్స్: థియేటర్లలో దూసుకెళ్తోన్న నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం కథానాయికగా చేసిన అనుపమ పరమేశ్వరన్, దర్శకత్వం వహించిన చందూ మొండేటి కార్తికేయ 2 చిత్ర డిజిటల్ రైట్స్ ని కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సైట్ జీ5 కార్తికేయ 2 చిత్రంతో నిఖిల్ ఘనవిజయం అందుకున్నాడు. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. శ్రీ కృష్ణుడు, ద్వారకా నగరం, సైన్స్, హిస్టరీ వంటి అంశాల చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. ఆగస్టు […]

The post నిఖిల్ నటించిన కార్తికేయ 2 OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • థియేటర్లలో దూసుకెళ్తోన్న నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం
  • కథానాయికగా చేసిన అనుపమ పరమేశ్వరన్, దర్శకత్వం వహించిన చందూ మొండేటి
  • కార్తికేయ 2 చిత్ర డిజిటల్ రైట్స్ ని కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సైట్ జీ5

కార్తికేయ 2 చిత్రంతో నిఖిల్ ఘనవిజయం అందుకున్నాడు. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. శ్రీ కృష్ణుడు, ద్వారకా నగరం, సైన్స్, హిస్టరీ వంటి అంశాల చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. ఆగస్టు 13 న థియేటర్లలోకి వచ్చిన కార్తికేయ 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో జనాలను థియేటర్లకు రాబడుతోంది కార్తికేయ 2 సినిమా. గతంలో చందూ మొండేటి-నిఖిల్ కలయికలో వచ్చిన కార్తికేయ చిత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడి గొప్పతనం గురించి చెబితే, తాజాగా వచ్చిన కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి గురించి తెలిపింది. శ్రీ కృష్ణుడు ఎవరు, చరిత్రలో ఆయన పాత్ర ఏంటి అనేది సినిమాలో చూపించారు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ కొట్టింది. ఈ సినిమా హిట్ కావడంతో నిఖిల్ క్రేజ్ దేశ వ్యాప్తమైంది. హిందీ, తెలుగు భాషల్లో కార్తికేయ 2 చిత్రం హవా కొనసాగుతోంది. బాలీవుడ్ పెద్ద సినిమాలు రక్షాబంధన్, లాల్ సింగ్ చడ్డా చిత్రాలకు కార్తికేయ 2 గట్టి పోటీ ఇస్తుండటం విశేషం. మరోవైపు లాల్ సింగ్ చడ్డా చిత్రంపై ఉత్తరాదిన వ్యతిరేకత ఉండటంతో, ఆ అంశం కార్తికేయ 2 చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఇంకా అంతే, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. అడ్వెంచరస్, మైథాలజీ సినిమా అయిన కార్తికేయ 2 చిత్ర కథ అందరికీ బాగా నచ్చడం మరొక ప్లస్ పాయింట్.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న కార్తికేయ 2

ఇప్పటి వరకు కార్తికేయ 2 మూడు రోజుల్లో రూ.15 కోట్లను వసూలు చేసింది. ఈ వసూళ్ళు హిందీ బెల్ట్ కలెక్షన్స్ ని కలుపుకుని వచ్చినవి. ఇకపోతే కార్తికేయ 2 ఇప్పటికే చాలా చోట్ల బ్రేకీవెన్ సాధించగా, ప్రస్తుతం లాభాలను రాబడుతోంది. స్వాతంత్ర దినోత్సవం సెలవు రోజు కావడంతో జనాలు అత్యదిక సంఖ్యలో థియేటర్లకు క్యూ కట్టారు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషించారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కార్తిక్ జి ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడంతో పాటు, సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.

శ్రీకృష్ణుని కాలి కడియాన్ని నిఖిల్ ఎలా పొందుతాడనే దానిపై చిత్ర కథ హైదరాబాద్, ద్వారక, మధుర మీదుగా హిమాలయాలకు చేరుకుంటుంది. వైద్యుడి పాత్రలో నిఖిల్ నటన బాగుంది. దైవుడిని నమ్మని ఓ వైద్యుడు దైవకార్యం కోసం నడుం బిగించడం సినిమాలో ఆసక్తి కలిగించే విషయం. ఆదిత్య మేనన్, వెంకట్ విలన్లుగా మెప్పించారు. ట్రక్ డ్రైవర్ గా వైవా హర్ష, నిఖిల్ కి మేనమామగా శ్రీనివాస్ రెడ్డి హాస్యాన్ని పంచారు. అనుపమ్ ఖేర్ పాత్ర కాసేపే అయినా, చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు.

Karthikeya 2 హక్కులను కొన్న Zee5 OTT

50 రోజుల తర్వాత జీ5 లో కార్తికేయ 2 సినిమా ప్రసారం అవ్వనున్నట్లు సమాచారం. జీ5 ఓటీటీ సంస్థ అన్ని భాషల హక్కులను కొన్నట్లు తెలుస్తోంది. అంటే మరికొన్ని రోజులు కార్తికేయ 2 థియేటర్లలో తన హవా కొనసాగించనుందన్న మాట.

The post నిఖిల్ నటించిన కార్తికేయ 2 OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>