
ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్.. స్మార్ట్ ఫోన్ ఏదైనా సరే, దాదాపు అన్నీ టార్చి లైట్ లాగా పని చేస్తాయి. ఫోన్ లో ఉన్న ఫ్లాష్ కి ఇక్కడ థాంక్స్ చెప్పుకోవాల్సిందే. కరెంటు లేని సమయాల్లో, ఇంకా వెలుతురు సరిగ్గా లేని చోట ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఫ్లాష్ లైట్ ని ఆన్ లేదా ఆఫ్ చేసేందుకు పలు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మీరు థర్డ్ పార్టీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఫ్లాష్ లైట్ ను వాడుకోవచ్చు.
– ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ పై ఫ్లాష్ లైట్ ను ఆన్/ఆఫ్ చేయడం ఎలా
1. క్విక్ సెట్టింగ్స్ ద్వారా చేయొచ్చు
* మీఫోన్ ని స్విఛాన్ చేయండి
* హోమ్ స్క్రీన్/లాక్ స్క్రీన్ నుంచి సెట్టింగ్స్ ప్యానెల్ కు వెళ్ళండి
* అక్కడ మీకు ఫ్లాష్ లైట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి
* మీ ఫోన్ యొక్క ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. మరోసారి ట్యాప్ చేస్తే కనుక ఆఫ్ అయిపోతుంది.
* గుర్తుపెట్టుకోండి. మీరు కనుక కెమెరాను ఆన్ చేస్తే, ఫ్లాష్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. కెమెరా, ఫ్లాష్ మాడ్యూల్ ని ఉపయోగించుకోవడమే దీనికి కారణం.
2. షార్ట్ కట్స్ మరియు జెశ్చర్స్ ద్వారా..
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఫ్లాష్ లైట్ ఆన్/ఆఫ్ కోసం వివిధ షార్ట్ కట్స్ ని అందిస్తున్నాయి. మీ వద్ద శాంసంగ్, మోటోరోలా, వన్ ప్లస్ ఫోన్ ఉంటే ఈ షార్ట్ కట్ వాడండి.
- శాంసంగ్ ఫోన్స్:
* సెట్టింగ్స్ ఓపెన్ చేయండి
* క్రిందకు స్వైప్ చేసి అడ్వాన్స్డ్ ఫీచర్స్ పై క్లిక్ చేయండి
* తర్వాత సైడ్ కీ పై ట్యాప్ చేయండి
* డబుల్ ప్రెస్ మెను క్రింద, ఓపెన్ యాప్ పై ట్యాప్ చేయండి
* ఇక్కడ టార్చ్ ని ఎంచుకోండి
* ఇప్పుడు మీ ఫోన్ యొక్క పవర్ కీ ని రెండు సార్లు నొక్కి ఫ్లాష్ లైట్ ను యాక్టివేట్ చేయండి. ఇక పవర్ కీ ని ఒకసారి నొక్కితే ఫ్లాష్ లైట్ ఆఫ్ అవుతుంది.
- వన్ ప్లస్ ఫోన్స్..
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో ఆఫ్-స్క్రీన్ జెశ్చర్స్ ని ఎనేబుల్ చేసి ఫ్లాష్ లైన్ ని ఆన్/ఆఫ్ చేయవచ్చు.
* సెట్టింగ్స్ ఓపెన్ చేయండి
* స్వైప్ డౌన్ చేసి బటన్స్, జెశ్చర్స్ ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు అలర్ట్ స్లైడర్, నేవిగేషన్ బార్ & జెశ్చర్స్, క్విక్ జెశ్చర్స్ ఆప్షన్స్ ని గమనిస్తారు.
* క్విక్ జెశ్చర్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సిస్టమ్ జెశ్చర్స్ తో పాటు స్క్రీన్ ఆఫ్ జెశ్చర్స్ సెక్షన్ కనిపిస్తుంది. స్క్రీన్ ఆఫ్ జెశ్చర్స్ కు వెళ్ళండి.
* డ్రా ఓ/ డ్రా వీ/డ్రా ఎస్/డ్రా ఎం/డ్రా డబ్ల్యూ సెట్టింగ్స్ లో ఏదేనీ ఒక దానిపై ట్యాప్ చేయండి.
* ఫ్లాష్ లైట్ కోసం ఓ ఆప్షన్ ఎంచుకోండి.
* ఇప్పుడు మీ ఫోన్ ని స్లీప్ మోడ్ లోకి వెళ్ళనివ్వండి. ఎప్పుడైతే మీరు ఫ్లాష్ లైట్ ని ఆన్ చేయాలనుకుంటారో అప్పుడు స్క్రీన్ పై మీరు ఫ్లాష్ లైట్ కోసం ఎంచుకున్న లెటర్ ను వేలితో గీయండి.
అంతే ఫ్లాష్ లైట్ ఆన్ అయిపోతుంది. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పై కూడా చేయవచ్చు. ఇక పవర్ బటన్ నొక్కి ఫ్లాష్ లైట్ ను ఆపేయవచ్చు.
- మోటోరోలా ఫోన్స్
ఫ్లాష్ లైట్ ని ఆన్ చేసేందుకు మోటోరోలా ఫోన్స్ లో డబుల్ చాప్ అనే అద్భుతమైన ఫీచర్ ఉంది. దీన్నే ఫాస్ట్ ఫ్లాష్ అని కూడా పిలుస్తారు. మరి ఇదెలా పని చేస్తుందో చూద్దాం.
* మోటో యాప్ లోకి వెళ్ళండి
* ఇక్కడ మోటో యాక్షన్స్ పై ట్యాప్ చేయండి
* ఇక్కడ మీరు ఫాస్ట్ టార్చ్ ని చూస్తారు. దాన్ని ఆన్ చేయండి.
* ఇప్పుడు, మీ ఫోన్ ఎప్పుడైతే స్లీప్ మోడ్ లో ఉంటుందో, సింపుల్ గా మీ ఫోన్ ని చాపింగ్ మోషన్ లో రెండు సార్లు షేక్ చేయండి. అంతే ఫ్లాష్ లైట్ యాక్టివేట్ అవుతుంది. మరోసారి అదే మోషన్ ని రిపీట్ చేయడం ద్వారా ఫ్లాష్ లైట్ ను ఆఫ్ చేయవచ్చు.
3. బటన్ రీమ్యాపర్ ద్వారా..
మీ వద్ద నోకియా ఫోన్ లేదా బడ్జెట్ మోటోరోలా ఫోన్ ఉన్నట్లయితే, మీ ఫోన్ కచ్చితంగా గూగుల్ అసిస్టెంట్ అనే బటన్ ను కలిగి ఉంటుంది. మరి ఆ బటన్ ను మీరు మరో పని చేయడం కోసం మారిస్తే ఎలా ఉంటుంది? అవును ఆ పని మీరు చేయవచ్చు.
* ప్లే స్టోర్ నుంచి బటన్ మ్యాపర్ ను డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయండి.
* యాప్ ఓపెన్ చేసి యాక్సెసబిలిటీ సెట్టింగ్స్ లో అనుమతులివ్వండి.
* పర్మిషన్స్ ఇచ్చాక, బటన్స్ ను రీమ్యాప్ చేసేందుకు ఆప్షన్స్ ఇవ్వబడతాయి.
* యాడ్ బటన్స్ పై ట్యాప్ చేయండి. అలాగే క్రింద కుడివైపు చివర్లో ఉన్న ప్లస్ గుర్తుని నొక్కండి.
* ఇప్పుడు మునుపటి మెనూ లోకి వెళ్ళి, కొత్తగా వచ్చిన బటన్ ను నొక్కండి, కస్టమైజ్ పై టోగుల్ చేయండి.
* ఇప్పుడు సింగిల్ ట్యాప్ పై ట్యాప్ చేయండి.
* టోగుల్ ఫ్లాష్ లైట్ కనబడే వరకు స్క్రోల్ డౌన్ చేసి, దానిపై ట్యాప్ చేయండి.
* ఇప్పుడు మీ షార్ట్ కట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మీ యాక్ససరీ కీ ని ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. ఆఫ్ చేయాలనుకుంటే మరలా దాన్ని ట్యాప్ చేయండి.
* మీ ఫోన్స్ అడిషనల్ కీ కలిగి లేకపోతే, మీరు పవర్/వాల్యూమ్ కీస్ ని కూడా రీమ్యాప్ చేసుకోవచ్చు.
4. మొబైల్ వెనకాల డబుల్ ట్యాప్ చేయడం ద్వారా..
మీ ఫోన్ వెనకాల రెండు మార్లు మీటడం ద్వారా ఫ్లాష్ లైట్ ని ఆన్ చేయవచ్చు.
* ఇక్కడ లింకు ద్వారా ట్యాప్ ట్యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి
* సెటప్ ప్రాసెస్ ను ఫాలో అవ్వండి
* ప్రాథమిక సెటప్ పూర్తయ్యాక, యాప్ లో చూపిన విధంగా బ్యాటరీ ఆప్టిమైజేషన్ ను డిసేబుల్ చేయండి
* ఇప్పుడు డబుల్ ట్యాప్ యాక్షన్స్ పై ట్యాప్ చేసి, యాడ్ యాక్షన్ పై ట్యాప్ చేయండి
* ఇప్పుడు ఫ్లాష్ లైట్ పై ట్యాప్ చేయండి
* ఇక్కడ మీరు డిప్ప్లే ఓవర్ అథర్ యాప్స్, కెమెరా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతులు ఇచ్చాక, జెశ్చర్ ను పైకి తీసుకెళ్ళి రీపోజిషన్ చేయండి.
* ఇప్పుడు మీ డివైజ్ వెనకాల డబుల్ ట్యాప్ చేస్తే, ప్లాష్ లైట్ ఆన్ అవుతుంది. ఆఫ్ చేసేందుకు మరోసారి డబుల్ ట్యాప్ చేయండి.
5. గూగుల్ అసిస్టింట్ ద్వారా..
చివరిదైన ఈ విధానం ఎంతో తేలికైనది. సింపుల్ గా గూగుల్ అసిస్టెంట్ వాడండి.
* పవర్ కీ ని అదిమి పట్టుకోవడం ద్వారా లేదా హేయ్ గూగుల్ అని చెప్పడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ ను మేలుకొలపండి.
* అసిస్టెంట్ స్పందించాక, టర్న్ ఆన్ ద ఫ్లాష్ లైట్ అని చెప్పండి.
* అంతే, ఫ్లాష్ లైట్ ఆన్ అయిపోతుంది.
* ఇప్పుడు మరోసారి గూగుల్ అసిస్టెంట్ ను మేలుకొలిపి, టర్న్ ద ఫ్లాష్ లైట్ ఆఫ్ అని చెప్పండి. ఫ్లాష్ లైట్ ఆఫ్ అయిపోతుంది.
– ఐఫోన్ లో ఫ్లాష్ లైట్ ఆన్/ఆప్ చేయడం ఎలా
మనం ఆండ్రాయిడ్ సెక్షన్ పూర్తి చేశాం. ఇప్పుడు ఐవోఎస్ పై కన్నేద్దాం పదండి.
1. లాక్ స్క్రీన్ నుంచి..
ఫ్లాష్ లైట్ ని ఆన్ చేసేందుకు ఇదొక తేలికైన విధానం. మీ లాక్ స్క్రీన్ పై క్రింద ఎడమవైపున ఫ్లాష్ ఐకన్ కనిపిస్తుంది. మీ ఫోన్ వైబ్రేట్ అయ్యేదాకా దాన్ని సుదీర్ఘంగా అదిమి పట్టుకోవాలి. తర్వాత వదిలేస్తే, ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. మరోసారి అదే బటన్ ని ఎక్కువసేపు నొక్కి పట్టుకుని రిలీజ్ చేస్తే, ఫ్లాష్ లైట్ ఆఫ్ అవుతుంది.
2. కంట్రోల్ సెంటర్ ద్వారా..
* మీరు హోం స్క్రీన్ పై ఉంటే కనుక, సింపుల్ గా పైన కుడివైపు చివర నుంచి క్రిందకు స్వైప్ చేసి కంట్రోల్ సెంటర్ కు వెళ్ళండి. ఇక్కడ కనిపించే టార్చ్ ఐకన్ పై ట్యాప్ చేసి ఫ్లాష్ లైట్ ని ఆన్ చేయండి. మరోసారి ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది.
* మీరు మీ ఫ్లాష్ లైట్ యొక్క ఇంటెన్సిటీని పెంచాలనుకుంటే, సింపుల్ గా ఫ్లాష్ లైట్ ఐకన్ ను అదిమి పట్టుకుంటే మీకు ఇంటెన్సిటీ మోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు స్వైప్ అప్ అండ్ డౌన్ చేసి కావాల్సినంత ఇంటెన్సిటీని సెట్ చేసుకోండి.
3. బ్యాక్ ట్యాప్ జెశ్చర్ ద్వారా..
ఐవోఎస్ 15 పై నడిచే ఐఫోన్స్ లో బ్యాక్ ట్యాప్ జెశ్చర్ ద్వారా మీరు ఫ్లాష్ లైట్ ని ఆన్/ఆఫ్ చేయవచ్చు.
* సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి
* యాక్ససబులిటీ పై ట్యాప్ చేయండి
* పేజీ క్రింద భాగంలో ఉన్న బ్యాక్ ట్యాప్ పై ట్యాప్ చేయండి
* ఇప్పుడు డబుల్ ట్యాప్ పై ట్యాప్ చేయండి
* ఆప్షన్స్ లో ఫ్లాష్ లైట్ పై ట్యాప్ చేయండి
* ఇప్పుడు మీరు ఐఫోన్ వెనకాల డబుల్ ట్యాప్ చేయడం ద్వారా ఫ్లాష్ లైట్ ఆన్ చేయవచ్చు. మరోసారి డబుల్ ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆఫ్ అవుతుంది.
ఈ షార్ట్ కట్ ద్వారా మీ ఐఫోన్ స్క్రీన్ ని ఆన్ చేయకుండానే ఫ్లాష్ లైట్ ని ఆన్/ఆఫ్ చేయవచ్చు.
4. సిరి ని ఉపయోగించడం ద్వారా..
ఐఫోన్ లో ఫ్లాష్ లైట్ ని ఆన్ చేయడానికి ఇది మరో తేలికైన ఆప్షన్.
* మీ ఐఫోన్ పై, పవర్/హోమ్ బటన్ ని నొక్కడం ద్వారా సిరి ని మేలుకొల్పండి. లేదా సింపుల్ గా హేయ్ సిరి అని చెప్పండి.
* టర్న్ ఆన్ ద ఫ్లాష్ లైట్ అని చెప్పండి
* ఇప్పుడు మీ ఐఫోన్ యొక్క ఫ్లాష్ లైట్ టర్న్ ఆన్ అవుతుంది.
* ఇప్పుడు మరోసారి సిరి ని మేలుకొలిపి టర్న్ ఆఫ్ ద ఫ్లాష్ లైట్ అని చెప్పండి. ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఆఫ్ అవుతుంది.