Instagram అకౌంట్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేయడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి!

మీరు గనుక ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చే కామెంట్స్, నోటిఫికేషన్స్, ఫ్రెండ్ రిక్వెస్ట్స్ తో విసిగిపోయారా? ఈ ప్లాట్ఫామ్ నుంచి బ్రేక్ తీసుకుందామని ఆలోచిస్తున్నారా? ఒకవేళ అవునని మీ సమాధానం అయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. మీరు గనుక పర్మనెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేయాలనుకుంటే లేదా కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందామని అనుకున్నా.. కొన్ని రోజుల పాటు మీ ఖాతాను డిసేబుల్ చేయవచ్చు. మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే తేలికైన మార్గం తెలుసుకుందాం పదండి.

Instagram ఖాతాను డిలీట్ చేయడం ఎలా?

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. బ్రౌజర్, ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేయవచ్చు. క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

బ్రౌజర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేయడం ఎలా?

వెబ్ బ్రౌజర్ ద్వారా మీరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయాలనుకుంటే, ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: ఇన్‌స్టాగ్రామ్ లోకి లాగిన్ అయ్యాక, బాటమ్ లెఫ్ట్ లో కనిపిస్తోన్న More ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ కి వెళ్ళండి.

  • స్టెప్ 2: అకౌంట్స్ సెంటర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ కి వెళ్ళండి.
  • స్టెప్ 3: ఇక్కడ మీరు అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు డీయాక్టివేషన్ లేదా డిలీషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: ఇక్కడ మీకు డీయాక్టివేషన్ లేదా డిలీట్ యువర్ అకౌంట్ ఆప్షన్ వస్తుంది. మీరు కావాలనుకుంటే, అకౌంట్ ని కొంత కాలం వరకు లేదా, శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకుంటున్న ఖాతాపై క్లిక్ చేయండి.
  • స్టెప్ 5: మీరు గనుక పర్మనెంట్ గా అకౌంట్ ని డిలీట్ చేయాలనుకుంటే, డిలీట్ అకౌంట్ పై క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 6: ఇప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ కోడ్ మీ ఈమెయిల్ కి వస్తుంది. కోడ్ ఎంటర్ చేశాక, కంటిన్యూ పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు మీ ఖాతాను పర్మనెంట్ గా డిలీట్ చేయవచ్చు.

Instagram అకౌంట్‌ని ఆండ్రాయిడ్ యాప్ ద్వారా డిలీట్ చేయడం ఎలా?

ఇన్‌స్టాగ్రామ్ యాప్ లో అకౌంట్ సెంటర్ ద్వారా ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేసేందుకై ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: ఇన్‌స్టాగ్రామ్ యాప్ లోకి లాగిన్ అయ్యాక, క్రింద కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా ప్రొఫైల్ ఫోటో పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 2: ఇప్పుడు టాప్ లో కుడివైపున మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: ఇప్పుడు అకౌంట్ సెంటర్ కి వెళ్ళి అక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: ఇక్కడ మీరు అకౌంట్ ఓనర్షిప్ మరియు కంట్రోల్ కి వెళ్ళండి. ఇప్పుడు డీయాక్టివేషన్ అండ్ డిలీషన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 5: ఇప్పుడు మీరు పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకుంటోన్న అకౌంట్ పై ట్యాప్ చేయండి.
  • స్టెప్ 6: ఇక్కడ డిలీట్ అకౌంట్ పై క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ పై నొక్కండి. దీని తర్వాత మీరెందుకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నారో కారణం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • స్టెప్ 7: అన్నింట్లో ఒక కారణాన్ని ఎంచుకుని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మీరు మీ పాస్‌వర్డ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత, మీరు మీ ఖాతాను డిలీట్ చేసుకోగల్గుతారు.

iPhone లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేయడం ఎలా?

ఇన్‌స్టాగ్రామ్ యాప్ ద్వారా మీరు గనుక మీ ఇన్‌స్టా అకౌంట్ ని పర్మనెంట్ గా డిలీట్ చేయానుకుంటే, ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: ఇన్‌స్టాగ్రామ్ యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత, ప్రొఫైల్ పిక్చర్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 2: ఇప్పుడు పైన కుడివైపున మోర్ ఆప్షన్స్ పై నొక్కండి. తర్వాత సెట్టింగ్ అండ్ ప్రైవసీ పై క్లిక్ చేయండి. ఇప్పుడు అకౌంట్ పై క్లిక్ చేశాక, మీకు డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై ట్యాప్ చేయండి.
  • స్టెప్ 3: డిలీట్ అకౌంట్ పై నొక్కిన తర్వాత, కంటిన్యూ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: ఇక్కడ మీకు ‘why do you want to delete’ (మీరెందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారు? అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి సరేన కారణం ఎంచుకోవాలి. అప్పుడు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ముందుకు కొనసాగాలి.
  • స్టెప్ 5: ఇప్పుడు డిలీట్ పై నొక్కి, తర్వాత ఓకే పై క్లిక్ చేయండి.
Previous articleరివీలైన OPPO Reno 11 సిరీస్ ఫస్ట్ గ్లిమ్స్, లాంచ్ తేదీ
Next articleDimensity 9300 చిప్, 100X జూమ్ ఫీచర్‌తో చైనాలో లాంచైన Vivo X100, Vivo X100 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.