Home News రూ.10,000 ధర లోపు లభించే పది 5000mAh బ్యాటరీ ఫోన్లు

రూ.10,000 ధర లోపు లభించే పది 5000mAh బ్యాటరీ ఫోన్లు

Highlights
  • అధిక బ్యాటరీ కెపాసిటీ గల ఫోన్లకు జనాల్లో మాంచి డిమాండ్
  • వివిధ కంపెనీల్లో అందుబాటులో ఉన్న 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లు
  • రూ.10 వేల లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ ఫోన్ల జాబితా మీకోసం

https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2022/10/Redmi-A1.jpg

భారతదేశంలో ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లలో ఎంట్రీ లెవెల్ ఫోన్లను వాడే వారి శాతం కూడా గణనీయంగానే ఉంది. సాధారణ వాడకం కోసం ఫోన్ వినియోగించే వారు ప్రధానంగా చూసే అంశం ‘బ్యాటరీ’. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే, ఫోన్ ఎక్కువ సేపు పని చేస్తుంది. కొన్ని ఫోన్లు ఒక పూర్తి రోజు బ్యాటరీ లైఫ్ ని అందిస్తే, మరికొన్ని ఫోన్లు రెండు రోజుల వరకు కూడా బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఈ ఆర్టికల్ లో మనం రూ.10 వేల లోపు ధరలో లభించే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన 10 స్మార్ట్ ఫోన్ల జాబితా తెలుసుకుందాం.

రూ.10 వేల ధర లోపు లభించే ’10’ 5000ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్లు

1. POCO C55

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 4జిబి మరియు 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. 50ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఈ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,499 తో ప్రారంభమవుతుంది.

2. Infinix Hot 30i

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 50ఎంపి + ఏఐ లెన్స్ తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. ఫ్లిప్ కార్ట్ లో ఈ డివైజ్ 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.9,499 గా ఉంది.

3. Motorola G13

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. డాల్బి అట్మాస్ స్పీకర్స్ ఈ ఫోన్ లో అందించారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది.

4. Infinix Note 12i

ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉండటం విశేషం. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది.

5. Samsung Galaxy F04

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఈ ఫోన్ లో వాడారు. 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,499 గా ఉంది.

6. Realme C33

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో యూనిసాక్ టీ612 చిప్సెట్ వాడారు. 50ఎంపి + 0.3ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది.

7. Infinix Smart 6 HD

ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ కలిగిన ఈ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.5,799 గా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ అందించారు.

8. Motorola e13

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో యూనిసాక్ టీ606 ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7,749 గా ఉంది.

9. Realme C30

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ తో ఈ ఫోన్ ని వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోన్ 2జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.5549 గా ఉంది.

10. Redmi A1

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. ఇందులో 8ఎంపి డ్యూయల్ ఏఐ మెయిన్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ 2జిబి ర్యామ్ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.5,899 గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.