హైలైట్స్:
- భారత్ లో జరిగిన 5జీ వేలంలో రూ.1.45 లక్షల కోట్లు విలువజేసే స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసిన టెలీకామ్ కంపెనీలు
- తొలిరోజు వేలంపాటలో 40 శాతం మేర అమ్ముడైన 700 మెగాహెర్ట్జ్ లో-బ్యాండ్
- భారత్ లో సెప్టెంబర్ నుంచి లాంచ్ అవ్వనున్న 5జీ సేవలు, ఆగస్టు 14 కంటే ముందే స్పెక్ట్రమ్ ని కేటాయించనున్న ప్రభుత్వం
మంగళవారం నాడు భారత మొబైల్ నెట్వర్క్ స్పెక్ట్రమ్ లో అతిపెద్ద వేలం నిర్వహించబడింది. ఈ వేలంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, అదానీ డేటా వర్క్స్ రూ.1.45 లక్షల కోట్ల బిడ్ వేసి రికార్డు నమోదు చేశాయి. వేలం పై కమ్యూనికేషన్స్ మినిస్టర్ అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. వేలం ఇంకా కొనసాగుతుందని, నాలుగు టెలీకామ్ సంస్థలు బలమైన బిడ్డింగ్ వేసాయని మంత్రి అన్నారు. మొదటి రోజున రూ.1.45 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ ను కంపెనీలు కొనుగోలు చేశాయి.దీంతో 2015 రికార్డులు బద్ధలైనట్లైంది. ఇక దేశంలో సెప్టెంబర్ నుంచి 5జీ సేవలు లాంచ్ అవ్వనున్నాయి. డెడ్ లైన్ తేదీ ఆగస్టు 14 లోపే ప్రభుత్వం స్పెక్ట్రమ్ ను కేటాయించనుంది.
స్పెక్ట్రమ్ కొరకు జరుగుతోన్న వేలం ఆఫర్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్
- లో-బ్యాండ్: 600 మెగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2300 మెగాహెర్ట్జ్, 2500 మెగాహెర్ట్జ్.
- మిడ్-బ్యాండ్ (సీ-బ్యాండ్): 3.3 గిగాహెర్ట్జ్ నుంచి 3.67 గిగాహెర్ట్జ్ వరకు.
- హై-బ్యాండ్: 26 గిగాహెర్ట్జ్
భారత్ లో 5G వేలం
మొదటిరోజు వేలంలో పైస్థాయి బ్యాండ్స్ కి నాలుగు రౌండ్స్ బిడ్డింగ్ జరిగింది. మిడ్ మరియు హై బ్యాండ్స్ (3.3 గిగాహెర్ట్జ్ నుంచి 26 గిగాహెర్ట్జ్ వరకు) ఇందులో ఉన్నాయి. గతంలో లో-బ్యాండ్ (700 మెగాహెర్ట్జ్) పై పెద్దగా ఆసక్తి చూపని, టెలీకామ్ కంపెనీలు ఈ బ్యాండ్ కి భారీగా బిడ్డింగ్ వేశాయి. ఇప్పటికే 700 మెగాహెర్ట్జ్ లో-బ్యాండ్ 40 శాతం మేర అమ్ముడైంది. 72 గిగాహెర్ట్జ్ కలిగిన 5జీ తరంగాలను 10 బ్యాండ్స్ వ్యాప్తంగా, 4.3 లక్షల కోట్ల కనీస ధరతో చివరి 5 రౌండ్లను రెండో రోజున వేలానికి అందుబాటులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
5జీ వేలంలో నాలుగు టెలీకామ్ కంపెనీల యొక్క ది ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) విలువ రూ.21,400 కోట్లు. రిలయన్స్ జియో రూ.14,000 కోట్లను చెల్లించగా, భారతి ఎయిర్టెల్ రూ.5,500 చెల్లించింది. వొడాఫోన్ ఐడియా రూ.2,200 కోట్లు, అదానీ డేటా నెట్వర్క్స్ రూ.100 కోట్లు ఇచ్చాయి.
వేలం యొక్క నిబంధనల ప్రకారం, 5జీ స్పెక్ట్రమ్ బిడ్ కు సంబంధించిన స్పెక్ట్రమ్ కేటాయింపులను ఏ కంపెనీ గెలుచుకుందోనన్న విషయాన్ని ముందుగానే ప్రకటించకూడదు. పూర్తి వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇటువంటి విషయాలను బయటకు వెల్లడించవచ్చు. కాబట్టి కంపెనీల నుంచి అప్పుడే ఎటువంటి ప్రకటనలు ఉండబోవు.
కాగా, 5జీ స్పెక్ట్రమ్ 4జీ కంటే అల్ట్రా-హై స్పీడ్స్ ని ఆఫర్ చేస్తుంది. ఇది 4జీ తో పోల్చితే 10 రెట్లు అధికం. దీని ద్వారా ల్యాగ్-ఫ్రీ కనెక్టివిటీ, సూపర్ స్మూత్ గేమింగ్, స్పీడ్ డేటా షేర్ వంటి లాభాలు 5జీ రాకతో కలగనున్నాయి. సెకనుల వ్యవధిలో ఫుల్ లెంగ్త్ హై క్వాలిటీ వీడియో లేదా సినిమాను డౌన్ లోడ్ చేసుకోగలడం 5జీ ప్రత్యేకత.













