
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా నథింగ్ కంపెనీ Nothing Phone (2a) డివైజ్ లాంచ్ ని ఖరారు చేసింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. కాకపోతే, Nothing Phone (2a) పేరుని రివీల్ చేసింది. తన మొదటి కమ్యూనిటీ అప్డేట్ 2024 లో Nothing Phone (2a) పేరుని వెల్లడించింది. ఈ ఫోన్ Aerodactyl అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. భారత్ లో Nothing Phone (2a) లాంచ్ కానుందని ఫ్లిప్‌కార్ట్ లోని మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది.
Nothing Phone (2a) లాంచ్ వివరాలు
The first Nothing Community Update of 2024 is here!
It's an exciting start to the year as we introduce our new VP of Marketing, Glyph Developer Kit, and, if you haven't guessed by now, Aerodactyl – our latest smartphone.
Sit down, tune in, and enjoy. pic.twitter.com/uYpsTdAzWb
— Nothing (@nothing) February 1, 2024
- Nothing Phone (2a) లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- గతంలో నథింగ్ కంపెనీ అధినేత కార్ల్ పే Nothing Phone (2a) గురించి హింట్ ఇచ్చారు. అయితే పేరుని వెల్లడించలేదు.
- కొన్ని రోజుల క్రితం టీడీఆర్ఏ సర్టిఫికేషన్ ద్వారా Nothing Phone (2a) పేరు కన్ఫర్మ్ అయ్యింది. టీడీఆర్ఏ లిస్టింగ్ లో A412 అనే మోడల్ నంబర్ తో డివైజ్ కనిపించింది.
- ఇక, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో Nothing Phone (2a) మైక్రో-సైట్ ప్రస్తుతం దర్శనమిస్తోంది.
- Nothing Phone (2a) డివైజ్ మీడియాటెక్ చిప్సెట్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది. ఓసారి అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1084*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) లో 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
- సాఫ్ట్‌వేర్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
- కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ఉంటుంది.
- బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Nothing Phone (2a) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.











