
భారత్‌లో ఇటీవలె OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 3 Pro అనే మరొక డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఏస్ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన OnePlus Ace 2 Pro కి సక్సెసర్ గా OnePlus Ace 3 Pro మార్కెట్ లోకి రానుంది. తాజాగా OnePlus Ace 3 Pro యొక్క చిప్సెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Ace 3 Pro ప్రాసెసర్ (లీక్)
- ప్రాసెసర్: OnePlus Ace 3 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. దీని మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్. ఈ ఆక్టా-కోర్ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్75 5జీ మోడెమ్ తో వస్తోంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 Pro ర్యామ్, స్టోరేజీ వివరాలను ఒక విదేశీ టిప్‌స్టర్ షేర్ చేశారు. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 24జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిజైన్: OnePlus Ace 3 Pro డివైజ్ కర్వ్డ్ స్క్రీన్, మెటల్ మిడిల్ ఫ్రేమ్, టోన్-నాచ్ టెక్షర్ తో వస్తోంది.
- స్క్రీన్: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ఓఎస్: OnePlus Ace 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OnePlus Ace 3 Pro కి సంబంధించిన బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే OnePlus Ace 3 Pro అధికార ప్రకటనను వన్‌ప్లస్ రానున్న రోజుల్లో చేయనుంది.
Source: 91mobiles Hindi











