
HMD (హ్యూమన్ మొబైల్ డివైజెస్) కంపెనీ త్వరలోనే తన బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఈ సంస్థ నోకియా బ్రాండ్ పేరుపై ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు HMD బ్రాండ్ పై కూడా స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతోంది. దీంతో టెక్ వర్గాలు, యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం HMD కి చెందిన 9 ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి. తాజాగా గీక్‌బెంచ్ పై HMD కి సంబంధించిన రెండు ఫోన్లు లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
HMD Legend, LegendPro గీక్‌బెంచ్ లిస్టింగ్
- గీక్‌బెంచ్ 6 పై కనిపించిన రెండు లిస్టింగ్స్ HMD Global Legend మరియు HMD Global LegendPro పేర్లతో ఉన్నాయి.
- ఈ రెండు ఫోన్లు ఆక్టా-కోర్ చిప్సెట్, మాలి-జీపీయూ గ్రాఫిక్స్ తో కనిపించాయి. ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1.61 గిగాహెర్ట్జ్ గా ఉంది. ఇది యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ అని భావిస్తున్నారు.
- లెజెండ్ డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 379 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1,370 పాయింట్లు స్కోర్ చేసింది.
- లెజెండ్ ప్రో డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 373 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1,384 పాయింట్లు స్కోర్ చేసింది.
- ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- HMD Legend 4జిబి వరకు ర్యామ్, LegendPro 8జిబి వరకు ర్యామ్ తో రానున్నాయి.
HMD ఫోన్స్ లాంచ్ వివరాలు
- HMD స్మార్ట్‌ఫోన్ల లాంచ్ గురించి ఇంకా ఏ వివరాలు తెలియలేదు. త్వరలోనే ప్రకటన రావొచ్చు.
- HMD డివైజెస్ చూడటానికి గతంలో వచ్చిన నోకియా లూమియా సిరీస్ ఫోన్ల మాదిరిగా ఉంటాయని భావిస్తున్నారు.
- కొన్ని రోజుల క్రితం HMD గ్లోబల్ కంపెనీ 3 ఫోన్లను టీజ్ చేసింది. ఇవి బ్లూ, గ్రీన్ మరియు పింక్ కలర్స్ లో కనిపించాయి.
- వీటిలో రెండు HMD Legend మరియు HMD LegendPro అయ్యే అవకాశం ఉంది.
- కొన్ని రోజుల క్రితం 91మొబైల్స్ లీక్ చేసిన HMD ఫోన్ రెండర్ ని గమనిస్తే, లో మిడ్-రేంజ్ ఫోన్ అని తెలుస్తోంది.
- ఈ HMD డివైజ్ ప్లాస్టిక్ బిల్డ్, మ్యాట్ బ్లాక్ కలర్ తో కనిపిస్తోంది.
- మరొక లీక్ ద్వారా HMD నుంచి రాబోవు మొదటి బ్యాచ్ ఫోన్ 108ఎంపి ఓఐఎస్ కెమెరాతో రానున్నట్లు తెలిసింది.
- HMD డివైజెస్ పల్స్, లెజెండ్, పల్స్ ప్లస్, లెజెండ్ ప్లస్, పల్స్ ప్రో మరియు లెజెండ్ ప్రో అనే కోడ్ నేమ్స్ ని కలిగి ఉన్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ తెలిపారు.
- HMD నుంచి మొదటి బ్యాచ్ లో కనీసం 3 ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. ఐఎంఈఐ డేటాబేస్ పై మొత్తం 9 HMD డివైజెస్ లిస్ట్ అయ్యాయి.
- త్వరలో జరగబోవు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు HMD సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈవెంట్ లో తన ఫోన్లను పరిచయం చేసే అవకాశం ఉంది.











