Xiaomi: త్వరలో లాంచ్ కానున్న Xiaomi 14 Ultra టైటానియమ్ స్పెషల్ ఎడిషన్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 14 Ultra టైటానియమ్ ఎడిషన్
  • అల్యూమినియమ్ ఫ్రేమ్ తో వచ్చిన రెగ్యులర్ Xiaomi 14 Ultra
  • ఎండబ్ల్యూసీ 2024 లో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 14 Ultra

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో Xiaomi 14 Ultra డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ నెలాఖరులో ఈ ఫ్లాగ్షిప్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. లైకా తో తమ భాగస్వామ్యాన్ని షావోమీ టీజ్ చేస్తూ వస్తోంది. అలాగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో ఒక ఈవెంట్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. బార్సిలోనాలో ఫిబ్రవరి 25వ తేదీన ఎండబ్ల్యూసీ 2024 జరగనుంది. లాంచ్ తర్వాత వెంటనే చైనాలో సేల్ మొదలుకానుంది. 91mobiles అందిన ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని ఓసారి తెలుసుకుందాం.

Xiaomi 14 Ultra టైటానియమ్ ఎడిషన్ వివరాలు

  • Xiaomi 14 Ultra స్టాండర్డ్ వేరియంట్స్ అల్యూమినియమ్ ఫ్రేమ్ తో వచ్చాయి. దీంతో త్వరలోనే టైటానియమ్ స్పెషల్ ఎడిషన్ ని తీసుకురావాలని షావోమి భావిస్తోంది.
  • ధరను అందుబాటులో ఉంచేందుకై స్టాండర్డ్ వేరియంట్స్ అల్యూమినియమ్ ఫ్రేమ్ తోనే రానున్నాయి.
  • షావోమి Xiaomi 14 Ultra టైటానియమ్ స్పెషల్ ఎడిషన్ ని తీసుకొస్తోంది. అయితే ఇలా స్పెషల్ ఎడిషన్స్ తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది Xiaomi 14 Pro విషయంలో కూడా ఇదే స్ట్రేటజీని అనుసరించింది.
  • Xiaomi 14 Ultra మూడు స్టోరేజీ వేరియంట్స్ లో చైనాలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
  • Xiaomi 14 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి/1టిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • గతంలో లీకైన వివరాల ప్రకారం, Xiaomi 14 Ultra భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశముంది.
  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో గ్లోబల్ గా లాంచ్ అయ్యాక, షావోమి తన ఫ్లాగ్షిప్ Xiaomi 14 Ultra ని అన్ని మార్కెట్స్ లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
  • Xiaomi 14 Ultra తో పాటు గ్లోబల్ గా Xiaomi 14 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Xiaomi 14 Pro మాత్రం చైనా మార్కెట్ కే పరిమితం కానుంది.
  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో Xiaomi Pad 6S Pro కూడా లాంచ్ కానుంది. ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుంది.