
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy F15 5G ని లాంచ్ చేయనుంది. ఎఫ్-సిరీస్ తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆన్లైన్ చానల్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. Samsung Galaxy F15 5G లాంచ్ ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడలేదు. శాంసంగ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ అఫీషియల్ సపోర్ట్ వెబ్సైట్ పై Samsung Galaxy F15 5G లిస్ట్ అయ్యింది. తాజాగా లీకైన సమాచారం గురించి తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy F15 5G సపోర్ట్ పేజీ వివరాలు

- 91mobiles Samsung Galaxy F15 5G ని తొలుత శాంసంగ్ ఇండియా వెబ్సైట్ పై గుర్తించింది.
- Samsung Galaxy F15 5G డివైజ్ SM-E156B/DS మోడల్ నంబర్ తో అఫీషియల్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది.
- ఇదే మోడల్ నంబర్ తో Samsung Galaxy F15 5G శాంసంగ్ బంగ్లాదేశ్ అధికార వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది.
Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy F14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. 6జిబి వరకు ఎక్స్టెండబుల్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
- ఓఎస్: Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy F14 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఇతర ఫీచర్లు: ఏఐ వాయిస్ బూస్ట్, కస్టమైజ్డ్ కాల్ బ్యాగ్రౌండ్, స్టేక్డ్ విడ్జెట్స్, స్ప్లిట్ వ్యూ మల్టీ టాస్కింగ్, క్విక్ షేర్, ప్రైవసీ మరియు సెక్యూరిటీ డ్యాష్ బోర్డ్ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
- కనెక్టివిటీ: Samsung Galaxy F14 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.











