
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi A3 డివైజ్ ని లాంచ్ చేసింది. గత మోడల్ Redmi A2 కి ఇది సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6జిబి వరకు ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Redmi A3 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Redmi A3 ధర
- Redmi A3 స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- Redmi A3 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది.
- Redmi A3 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,299 గా ఉంది.
- Redmi A3 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,299 గా ఉంది.
- Redmi A3 స్మార్ట్‌ఫోన్‌ని ఫిబ్రవరి 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ మరియు ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Redmi A3 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
- ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో వర్షన్) ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Redmi A3 లో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ + గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











