
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO ఈ నెలలో భారతీయ మార్కెట్ లో Neo 9 Pro ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ తో పాటు మరో ఫోన్ iQOO Z9 ని కూడా లాంచ్ చేసేందుకు ఐకూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. iQOO Z9 డివైజ్ iQOO Z8 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి రానుంది. iQOO Z9 5G తాజాగా భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే iQOO Z9 5G లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
iQOO Z9 5G బీఐఎస్ సర్టిఫికేషన్
- iQOO Z9 5G డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై I2302 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- iQOO Z9 5G త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.
- చైనాకే పరిమితమైన iQOO Z8 5G ని iQOO Z9 5G రీప్లేస్ చేయనుంది.
- iQOO Z9 5G గతంలో బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, 5జీ నెట్వర్క్ సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యాయి.
iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: iQOO Z9 5G లో 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO Z9 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని సమాచారం. మరోవైపు టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్ ఉంటుందని తెలిపారు.
- బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
- iQOO Z9 5G సిరీస్ రెండర్స్ జనవరిలో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వాటిని బట్టి, iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది.
- iQOO Z9 5G లో వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ కుడివైపున ఉంటాయి. కర్వ్డ్ ఎడ్జెస్ గల డిస్ప్లే మరియు బ్లూ కలర్ ఆప్షన్ లో iQOO Z9 5G వస్తుదని తెలుస్తోంది.













