
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Galaxy F15 5G అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Samsung Galaxy F15 5G యొక్క మొదటి పోస్టర్ రివీల్ అయ్యింది. భారీ బ్యాటరీ, ఉత్తమమైన డిస్ప్లేతో గెలాక్సీ ఎఫ్15 5జీ వస్తున్నట్లు సమాచారం. Samsung Galaxy F15 5G యొక్క రెండర్ 91mobiles కి అందింది. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy F15 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు
- Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు రెండర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
- Samsung Galaxy F15 5G ఫోన్ బ్లాక్, పర్పుల్ మరియు మింట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Samsung Galaxy F15 5G లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందని మేం భావిస్తున్నాం.
- Samsung Galaxy F15 5G డివైజ్ 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం.
- శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై Samsung Galaxy F15 5G డివైజ్ SM-E156B/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- గతేడాది లాంచైన Samsung Galaxy F14 5G డివైజ్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది.
Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy F14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. 6జిబి వరకు ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
- ఓఎస్: Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy F14 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఇతర ఫీచర్లు: ఏఐ వాయిస్ బూస్ట్, కస్టమైజ్డ్ కాల్ బ్యాగ్రౌండ్, స్టేక్డ్ విడ్జెట్స్, స్ప్లిట్ వ్యూ మల్టీ టాస్కింగ్, క్విక్ షేర్, ప్రైవసీ మరియు సెక్యూరిటీ డ్యాష్ బోర్డ్ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
- కనెక్టివిటీ: Samsung Galaxy F14 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











