Samsung: లాంచ్‌కి ముందు గీక్‌బెంచ్‌పై లిస్టైన Galaxy F15 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F15 5G
  • డివైజ్ మోడల్ నంబర్ SM-E156B
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నిన్నే ఈ ఫోన్ యొక్క రెండర్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. నేడు Samsung Galaxy F15 5G బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Samsung Galaxy F15 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ 6 డేటాబేస్ పై SM-E156B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy F15 5G డివైజ్ సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 690 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1752 పాయింట్లు స్కోర్ చేసింది.
  • గీక్‌బెంచ్ ప్లాట్ఫామ్ పై కనిపించిన వివరాల ప్రకారం, Samsung Galaxy F15 5G లో 2.20 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయని తెలుస్తోంది.
  • లిస్టింగ్ సమాచారం ప్రకారం, Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుందని అంచనా వేయవచ్చు.
  • Samsung Galaxy F15 5G డివైజ్ బెంచ్‌మార్క్ డేటాబేస్ పై 4జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.
  • ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, Samsung Galaxy F15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో అమోలెడ్ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంటాయని సమాచారం. స్క్రీన్ సైజ్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది. గరిష్టంగా 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
Previous articleMotorola: 8జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Moto G04
Next articleSamsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి ర్యామ్ వేరియంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.