హైలైట్స్:
- రూ.9,499 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 9
- మీడియాటెక్ జీ37 చిప్సెట్, 13ఎంపి డ్యూయర్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు
- జులై 23 నుంచి భారత్ లో మొదలు కానున్న టెక్నో స్పార్క్ 9 అమ్మకాలు

టెక్నో నుంచి స్పార్క్ సిరీస్ లో వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ 9. భారత్ లో రూ.10 వేల ధరతో 11జిబి ర్యామ్ ని అందిస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో టెక్నో స్పార్క్ 9 యొక్క మైక్రో సైట్ ద్వారా ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్, అమ్మకాల వివరాలు తెలుస్తున్నాయి. టెక్నో స్పార్క్ 9 లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, బ్యాక్ ప్యానెల్ పై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 6.6 అంగుళాల 90 హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, 11జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. మరి టెక్నో స్పార్క్ 9 యొక్క ధర, ఇతర ఫీచర్లను గురించి తెలుసుకుందాం రండి.
భారత్ లో Tecno Spark 9 ధర

భారత్ లో టెక్నో స్పార్క్ 9 ధరను రూ. 9,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ స్కై మిర్రర్ మరియు ఇన్ఫినిటీ బ్లాక్ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో లభించనుంది. టెక్నో అధికార వెబ్ సైట్ తో పాటు, అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. జులై 23 నుంచి అమ్మకాలు జరుపుకోనున్న ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భాగం కానుంది.
Tecno Spark 9 స్పెసిఫికేషన్స్
- 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్
- 128జిబి స్టోరేజీ, 11జిబి వరకు ర్యామ్
- 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
- 8ఎంపి ఫ్రంట్ కెమెరా, డీటీఎస్ స్పీకర్స్
- ఆండ్రాయిడ్ 12
టెక్నో స్పార్క్ 9 ఫోన్లో 6.6 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ ద్వారా 11జిబి వరకు ఎక్స్ టెండబుల్ ర్యామ్, 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, హైఓఎస్ యూఐ కస్టమ్ స్కిన్, డీటీఎస్ పవర్డ్ స్పీకర్స్, 3.5ఎంఎం ఆడియో జ్యాక్ వంటి ఫీచర్లు టెక్నో స్పార్క్ 9 ఫోన్లో ఉన్నాయి.
ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని వారికి, అలాగే తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ ఆప్షన్ కోసం చూసే వారికి టెక్నో స్పార్క్ 9 ఫోన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే డిస్ప్లే హెచ్డీ+ కావడం గమనించాల్సిన విషయం. డిస్ప్లే సైజ్ విషయంలో అడ్జస్ట్ అయతే కనుక, స్పార్క్ 9 చక్కటి ఫోన్ అనడంలో సందేహమక్కర్లేదు. ఎందుకంటే ఇందులో 11జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే అవకాశముంది. 128జిబి స్టోరేజీ ఇస్తుండటం వల్లన వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను స్టోరేజీ విషయంలో ఏ టెన్షన్ లేకుండా హాయిగా వాడుకోవచ్చు.











