
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme 2024 జనవరిలో భారతీయ మార్కెట్ లో Realme 12 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే లాంచై నెల రోజులు పూర్తి కాకుండానే ఈ ఫోన్ పై రియల్మీ సంస్థ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ లో భాగంగా Realme 12 Pro+ 5G పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తోంది. Realme 12 Pro+ 5G కొనాలని భావించే కస్టమర్లకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Realme 12 Pro+ 5G ఆఫర్
- Realme 12 Pro+ 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ పై మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.
- Realme 12 Pro+ 5G డివైజ్ పై ఆఫర్ లో భాగంగా రూ.2,000 తగ్గింపుని పొందవచ్చు.
- ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 29 వరకు, ఏడు రోజుల పాటు Realme 12 Pro+ 5G పై ఈ డిస్కౌంట్ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.
- ఆఫర్ సమయంలో, Realme 12 Pro+ 5G 8జిబి+256జిబి మోడల్ ని రూ.29,999 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.31,999.
Realme 12 Pro+ 5G ధర
- Realme 12 Pro+ 5G డివైజ్ భారత్ లో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
- Realme 12 Pro+ 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది.
- Realme 12 Pro+ 5G 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది.
- Realme 12 Pro+ 5G 12జిబి+256జిబి మోడల్ ధర రూ.33,999 గా ఉంది.
- Realme 12 Pro+ 5G డివైజ్‌ని సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్ మరియు ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.
Realme 12 Pro+ 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Realme 12 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.












