Honor: 180MP పెరిస్కోప్ టెలీఫోటో కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Magic 6 Pro

Highlights

  • నేడు గ్లోబల్‌గా లాంచైన Honor Magic 6 Pro
  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చిన ఫోన్
  • 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరాతో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమేజింగ్ కెమెరా సెటప్ తో వచ్చింది. Honor Magic 6 Pro లో 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ని కలిగి ఉంది. ఇంకా ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. సరే, ఓసారి Honor Magic 6 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor Magic 6 Pro ధర

  • Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ గా 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది.
  • Honor Magic 6 Pro ధరను 1299 యూరోలు గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో దీని ధర రూ.1,16,669 గా ఉంటుంది.
  • Honor Magic 6 Pro డివైజ్ సేల్ మార్చి 1 నుంచి యూరప్ లో మొదలుకానుంది. ఈ ఫోన్ ఎపిక్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Honor Magic 6 Pro భారత్ లో లభిస్తుందా లేదా అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1280*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్టీపీవో ఓఎల్ఈడీ ఫ్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4320 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor Magic 6 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • బ్యాటరీ: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor Magic 6 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది.
  • ఓఎస్: Honor Magic 6 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor Magic 6 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ 3.1 ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Honor Magic 6 Pro లో ఐపీ68 రేటింగ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, 3డీ ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డీటీఎస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
Previous articleMotorola: లాంచ్‌కి ముందు Moto G Power 5G (2024)
Next articleHMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.