Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, Vivo V30 Pro ధరలు

Highlights

  • భారత్‌లో మార్చి 7న Vivo V30 సిరీస్ లాంచ్
  • తాజాగా లీకైన వివో వీ30 సిరీస్ ధర
  • ప్రారంభ ధర రూ.47,699 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 7న భారతీయ మార్కెట్ లో ఈ డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇండోనేషియాలో ఫిబ్రవరి 28న లాంచ్ కాబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల ధరలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro ధర

  • Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. దీని ధర IDR 89,99,000 (సుమారు రూ.47,699) గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
  • Vivo V30 Pro డివైజ్ 12జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Vivo V30 ధర

  • Vivo V30 రెండు మెమొరీ వేరియంట్స్ లో మార్కెట్ లో లాంచ్ కానుంది. లీక్ ప్రకారం, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 59,99,000 (సుమారు రూ.31,799) గా ఉంటుందని సమాచారం.
  • Vivo V30 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 69,99,000 (సుమారు రూ.37,199) గా ఉంటుందని లీక్ ద్వారా రివీల్ అయ్యింది.
  • Vivo V30 డివైజ్ గరిష్టంగా 12జిబి వర్చువల్ ర్యామ్ పవర్ ని అందిస్తుంది.
  • Vivo V30 డివైజ్ ఇండోనేషియాలో బ్లాక్, వైట్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo V30 సిరీస్ యొక్క భారత మార్కెట్ ధరలు వేరుగా ఉండనున్నాయి.

Vivo V30 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

  • Vivo V30 సిరీస్ భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లోని ఫోన్లకు సంబంధించిన ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం అధికార వెబ్‌సైట్ లో కనిపిస్తోంది.
  • Vivo V30 సిరీస్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తున్నట్లు మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది.

Vivo V30 Pro ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • Vivo V30 Pro డివైజ్ జీస్ ఆప్టిక్స్, ఓఐఎస్ పొట్రెయిట్ కెమెరా, ఆరా లైట్ తో వస్తోంది.
  • 2024 లో స్లిమ్మెస్ట్ ఫోన్ గా Vivo V30 Pro పిలవబడుతోంది. ఈ డివైజ్ ఎంతో తేలిగ్గా ఉంటుందని సమాచారం.
  • Vivo V30 Pro డివైజ్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
  • Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వివరాలు ఇంకా తెలియదు.
  • Vivo V30 Pro డివైజ్ క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ మరియు అండమాన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous articleiQOO: వచ్చే నెలలో లాంచ్ అవుతోన్న iQOO Z9 5G
Next articleMWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.