
MWC 2024 లో ఎన్నో బ్రాండ్స్ తమ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. HONOR కూడా Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు HONOR Pad 9 కూడా గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ ట్యాబ్లెట్ 12.1-ఇంచ్ భారీ స్క్రీన్, 16జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్‌ను కలిగి ఉంది. సరే, ఓసారి HONOR Pad 9 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత గురించి తెలుసుకుందాం పదండి.
HONOR Pad 9 ధర (గ్లోబల్)
- HONOR Pad 9 యునైటెడ్ కింగ్డమ్ లో 349 యూరోల ధరతో లాంచ్ అయ్యింది. భారతీయ కరెన్సీలో ఇది రూ.31,358 గా ఉంటుంది.
- యూకే మరియు ఐర్లాండ్ దేశాల్లో డిస్కౌంట్ ఆఫర్లతో వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా HONOR Pad 9 విక్రయించబడనుంది.
- HONOR Pad 9 డివైజ్ గ్లోబల్‌గా స్పేస్ గ్రే మరియు సైయన్ లేక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
HONOR Pad 9 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: HONOR Pad 9 లో 12.1-ఇంచ్ స్క్రీన్, 2.5కే ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ రేటింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: HONOR Pad 9 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: HONOR Pad 9 ట్యాబ్లెట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. టర్బో ర్యామ్ ఫీచర్ తో 16జిబి వరకు ర్యామ్ పవర్ పొందవచ్చు.
- కెమెరా: HONOR Pad 9 లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
- బ్యాటరీ: HONOR Pad 9 లో పవర్ బ్యాకప్ కోసం 8,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: HONOR Pad 9 ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











