Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A35
  • 6.6-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్‌తో వస్తోన్న డివైజ్
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A35 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్‌స్టర్ OnLeaks ద్వారా ఫోన్ వివరాలు బయటకు వచ్చాయి. రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A35 డివైజ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6జిబి/8జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A35 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: లీక్‌స్టర్ ప్రకారం, Samsung Galaxy A35 డివైజ్ లో 6.6-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A35 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A35 డివైజ్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తుంది.

Samsung Galaxy A35 ధర, కలర్ ఆప్షన్స్

  • Samsung Galaxy A35 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ ధర 389 యూరోలు (సుమారు రూ.35,000) గా ఉంటుంది.
  • Samsung Galaxy A35 డివైజ్ 8జిబి ర్యామ్ మోడల్ ధర 459 యూరోలు (సుమారు రూ.41,300) గా ఉంటుందని అంచనా.
  • Samsung Galaxy A35 డివైజ్ ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ లెమన్, ఆసమ్ లైలాక్ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Samsung Galaxy A35 స్మార్ట్‌ఫోన్ మార్చి నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ తో పాటు మరొక మోడల్ Samsung Galaxy A55 కూడా లాంచ్ అవుతోంది.
Previous articleVivo: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో గ్లోబల్‌గా లాంచైన V30 Pro
Next articleOPPO: IP65 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన OPPO F25 Pro 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.