
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో Galaxy A35 5G మరియు Galaxy A55 5G ఫోన్లను లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన ఈ కొత్త ఫోన్లు యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది. భారత్ లో శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు గిరాకీ బాగానే ఉంటుంది. ఈ ఫోన్లకు 4 ఏళ్ళు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ని శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A35 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చింది. ఓసారి ధర, సేల్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy A35 5G ధర
Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ ధర ఇంకా రివీల్ కాలేదు. మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు డివైజ్ సేల్ మొదలవుతుంది. అప్పుడే ధర వివరాలు వెల్లడవ్వనున్నాయి.
Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











