
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3V పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. కొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ ప్రెసిడెంట్ OnePlus Ace 3V లాంచ్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా OnePlus Ace 3V లైవ్ ఇమేజ్ ని స్వయంగా కంపెనీ ప్రెసిడెంట్ షేర్ చేశారు. దీంతో ఫోన్ డిజైన్, లుక్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Ace 3V లైవ్ ఇమేజ్ డిజైన్
వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ, OnePlus Ace 3V యొక్క లైవ్ ఫోటోలను షేర్ చేశారు. డివైజ్ ఫ్రంట్ డిజైన్ ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది.
OnePlus Ace 3V లో ముందువైపున పంచ్ హోల్ కటౌట్ ఉంది. బెజెల్స్ సన్నగా ఉన్నాయి. దీంతో ఫోన్ హై స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుందని తెలుస్తోంది.
విశేషమేంటంటే, ఈ ఫోన్ అలర్ట్ స్లైడర్ తో వస్తోంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి.
OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus Ace 3V లో 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- చిప్సెట్: OnePlus Ace 3V లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ చిప్సెట్ మార్చి 18న లాంచ్ అవుతోంది.
- కెమెరా: OnePlus Ace 3V లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3V లో 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ: OnePlus Ace 3V లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ లేదా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
- ఓఎస్: OnePlus Ace 3V డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
- ఇతర ఫీచర్లు: OnePlus Ace 3V లో ఏఐ టెక్నాలజీ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉంటాయి.











