అమెజాన్ యాడ్ ద్వారా లీకైన Redmi K50i ధర

హైలైట్స్:

  • లాంచ్ కి ముందు లీకైన రెడ్ మీ కే50ఐ ధర, సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్స్
  • జులై 23 నుంచి భారత్ లో సేల్ ప్రారంభం, ఫోన్ ధర రూ.25,999
  • 144హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

రెడ్ మీ కే50ఐ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ రోజు లాంచ్ కంటే ముందే భారత్ లో ఈ ఫోన్ ధర ఇన్ స్టాగ్రామ్ లో అమెజాన్ యాడ్ ద్వారా బయటకు వచ్చేసింది. కానీ, ఆ టీజర్ ద్వారా ఇంకా సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్స్ కూడా బయటకు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ డేస్ 2022 సేల్ లో రెడ్ మీ కే సిరీస్ ఫోన్ కూడా భాగమవుతోంది.

మూడేళ్ళ తర్వాత ఫ్యాన్-ఫేవరెట్ రెడ్ మీ కే సిరీస్ ను మళ్ళీ రెడ్ మీ కంపెనీ భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రెడ్మీ నోట్ 11టీ ప్రో పేరుతో చైనాలో మే నెలలో లాంచ్ అయిన ఫోన్ కి కే50ఐ రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని చెప్పవచ్చు. మరి దీని ఫీచర్లు, ధర, సేల్ తేదీ, బ్యాంక్ ఆఫర్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

భారత్ లో Redmi K50i ధర, సేల్ డేట్, బ్యాంక్స్ ఆఫర్

 

టిప్ స్టార్ అభిషేక్ యాదవ్ షేర్ చేసిన ఇమేజ్ ని బట్టి, రెడ్ మీ కే50ఐ అమెజాన్ ప్రైమ్ డేస్ 2022 సేల్ లో భాగం కానుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ధర రూ.25,999. కాగా, రెడ్ మీ కే50ఐ జులై 23 నుంచి భారత్ లో అమ్ముడవ్వనుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా వర్తిస్తుంది.

ఇప్పుడు రెడ్ మీ కే50ఐ 5జీ స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం. ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 64ఎంపి+8ఎంపి+2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు రెడ్ మీ కే50ఐ లో ఉన్నాయి.

రెడ్ మీ కే50ఐ 5జీ ని కొనేవారికి సూచనలేంటంటే, ఈ ఫోన్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఆ ఒక్క విషయం మినహా, అద్భుతమైన చిప్సెట్, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, చక్కటి కెమెరా, లేటెస్ట్ ఓఎస్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి సూపర్ ఫీచర్లతో ఈ ఫోన్ నిండి ఉంది. కాబట్టి, కొనుగోలుదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే బెటర్. అమెజాన్ ద్వారా జులై 23 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Previous article200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra
Next articleభారత్ లో లాంచ్ అయిన Vivo T1x
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.