iQOO: లీకైన Neo 9s Pro ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు

Highlights

  • త్వరలో iQOO Neo 9s Pro లాంచ్
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త నియో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Neo 9s Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ లైనప్ లో ఇప్పటికే Neo 9, Neo 9 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు నియో 9ఎస్ ప్రో డివైజ్ లాంచ్‌కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9s Pro ధర మరియు లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

iQOO Neo 9s Pro డివైజ్ వచ్చే నెలలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

iQOO Neo 9s Pro డివైజ్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

లీక్ ప్రకారం, iQOO Neo 9s Pro డివైజ్ తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ ధర 3000 యువాన్లు (సుమారు రూ.34,600) గా ఉంటుందని అంచనా.

iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

లీకైన సమాచారం ప్రకారం, iQOO Neo 9s Pro స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ వేరియంట్ ఈ చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

iQOO Neo 9s Pro డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ డివైజ్ కి సంబంధించిన కొన్ని ఫీచర్లు గత మోడల్ నియో 9 ప్రో మాదిరి ఉంటాయని సమాచారం.

Previous articleOPPO: 67W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన A3 Pro
Next articleVivo T3x 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన వివో టీ3ఎక్స్ 5జీ
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.