Moto G64 5G: 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్

Highlights

  • నేడు భారత్ లో Moto G64 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G64 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Moto G64 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G64 5G ధర, కలర్ ఆప్షన్స్

Moto G64 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Moto G64 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.

Moto G64 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.

Moto G64 5G స్మార్ట్‌ఫోన్ మింట్ గ్రీన్, పెర్ల్ బ్లూ మరియు ఐస్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G64 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G64 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Moto G64 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ప్రాసెసర్: Moto G64 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5GHz.

ఓఎస్: Moto G64 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా: Moto G64 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి డెప్త్ మరియు మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Moto G64 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Moto G64 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.