Vivo: FCC సర్టిఫికేషన్ పొందిన Vivo Y28 4G

Highlights

  • త్వరలో Vivo Y28 4G లాంచ్
  • 6000mAh బ్యాటరీ, 44W చార్జింగ్
  • మోడల్ నంబర్ V2352

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒకొ కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఎఫ్‌సీసీ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి సర్టిఫికేషన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y28 4G FCC లిస్టింగ్

Vivo Y28 4G డివైజ్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై V2352 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, బ్యాటరీ మోడల్ నంబర్ BA45 అని ఉంది. Vivo Y28 4G ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

V4440L0A0-US అనే మోడల్ నంబర్ తో చార్జర్ లిస్ట్ అయ్యింది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్. దీంతో Vivo Y28 4G 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Vivo Y28 4G డివైజ్ వై-ఫై, బ్లూటూత్ మరియు ఎల్టీఈ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Previous articleRedmi K70 కి రీబ్రాండ్ వర్షన్‌గా వస్తోన్న POCO F6 Pro
Next articleRealme GT 6T బీఐఎస్, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.