
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6T పేరుతో వస్తోన్న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 6.78-ఇంచ్ పంచ్ హోల్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ ధర లీక్ అయ్యింది. ఆ విశేషాలు తెలుసుకుందాం.
Realme GT 6T ధర (లీక్)
Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను టిప్‌స్టర్ సంజు చౌదరి X ద్వారా షేర్ చేశారు. అవెలా ఉన్నాయో చూద్దాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.29,999 గా ఉంటుంది. Realme GT 6T 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.31,999 గా ఉంటుంది.
12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.33,999 గా ఉంటుంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.33,999 గా ఉంటుంది. మరోవైపు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.35,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
Realme GT 6T స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
ప్రాసెసర్: Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటాయి. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8GHz. అంటుటు పై 1.5 మిలియన్ స్కోర్ చేసింది.
కెమెరా: Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











