Redmi 13 4G: లీకైన రెడ్మీ 13 4జీ ధర, ఇమేజ్, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో Redmi 13 4G లాంచ్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ప్రారంభ ధర రూ.18,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో ఒక కొత్త 4జీ ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఫోటోలు, స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు టిప్‌స్టర్ సుదాన్శు ద్వారా 91mobiles కి అందాయి. 6.79-ఇంచ్ భారీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఓసారి లీకైన ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 13 4G ధర (లీక్)

91మొబైల్స్‌ కి అందిన సమాచారం ప్రకారం, Redmi 13 4G రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 13 4G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 199 యూరోలు (సుమారు రూ.18,000) గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 229 యూరోలు (సుమారు రూ.21,000) గా ఉంటుంది.

Redmi 13 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Redmi 13 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

మెమొరీ: Redmi 13 4G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Redmi 13 4G లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Redmi 13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

Previous articleInfinix GT 20 Pro 5G లో ఉన్న టాప్ ఫీచర్లు తెలుసుకోండి
Next articleVivo: లీకైన S19, S19 Pro పోస్టర్, డిజైన్, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.