Samsung: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Galaxy M35 5G

Highlights

  • గ్లోబల్‌గా Galaxy M35 5G లాంచ్
  • Exynos 1380 ప్రాసెసర్
  • 6000mAh బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్‌‌గా ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

మెమొరీ: Samsung Galaxy M35 5G డివైజ్ బ్రెజిల్ లో 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్‌ని గరిష్టంగా 16జిబి వరకు పెంచుకోవచ్చు. 256జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy M35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్, నాక్స్ సెక్యూరిటీ, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి.

Samsung Galaxy M35 5G ధర

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ బ్రెజిల్ లో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ధర ఎంతో తెలుసుకుందాం.

Samsung Galaxy M35 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 2699 బ్రెజిలియన్ రియల్స్ గా ఉంది. అంటే భారత కరెన్సీలో దీన్ని రూ.43,500 గా చెప్పవచ్చు.

భారతీయ మార్కెట్ లో Samsung Galaxy M35 5G ధర రూ.35,000 లోపు ఉండవచ్చు. బ్రెజిల్ లో ఈ ఫోన్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ప్రకటన త్వరలోనే ఉండే అవకాశం ఉంది.

Previous articleOnePlus Nord CE 4 Lite 5G ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వివరాలు
Next articleRedmi K80 Pro: లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.