
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వలో తన సీవీ సిరీస్ ను భారత్‌కి పరిచయం చేయనుంది. Xiaomi 14 CIVI పేరుతో మొదటి సీవీ సిరీస్ ఫోన్ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీని షావోమి ఖరారు చేసింది. జూన్ 12వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదల అవుతోంది. ఈ ఫోన్ కెమెరా సిస్టమ్ కోసం షావోమి, లైకాతో కలిసి పని చేసింది. ఓసారి లాంచ్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Xiaomi 14 CIVI ఇండియా లాంచ్ తేదీ
Xiaomi 14 CIVI స్మార్ట్‌ఫోన్ భారత్ లో జూన్ 12న లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ డివైజ్ యొక్క మైక్రో-సైట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంఐ.కామ్ లపై కనిపిస్తోంది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలెలా ఉన్నాయో చూద్దాం.

Xiaomi 14 CIVI స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: Xiaomi 14 CIVI లో 1.5కే రెజుల్యూషన్ గల క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటాయి.
ప్రాసెసర్: Xiaomi 14 CIVI లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
రియర్ కెమెరా: Xiaomi 14 CIVI లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సమైలక్స్ 25ఎంఎం సినిమాటిక్ హెచ్డీఆర్ లెన్స్, 50ఎంపి పోట్రెయిట్ టెలీఫోటో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ సెన్సర్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 CIVI లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది డ్యూయల్ వీడియో మోడ్‌కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్వేర్: Xiaomi 14 CIVI డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14 CIVI లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Xiaomi 14 CIVI లో డాల్బీ అట్మాస్ ఆడియో, స్టీరియో స్పీకర్ సెటప్, మెటర్ ఫ్రేమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 5జీ, 4జీ వంటి ఫీచర్లు ఉంటాయి.
కలర్ ఆప్షన్స్: Xiaomi 14 CIVI డివైజ్ క్రూజ్ బ్లూ (డ్యూయల్-స్లైస్ ఎడిషన్), మచ్చా గ్రీన్ (వీగన్ లెదర్ ఎడిషన్) మరియు షాడో బ్లాక్ (మ్యాట్ షినిష్) కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.











