
Motorola సంస్థ త్వరలో తన కొత్త తరం ఫ్లిప్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజెస్ అడుగు పెట్టనున్నాయి. తాజాగా, Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క బెంచ్ మార్క్ స్కోర్స్, కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.
Motorola Razr 50 గీక్‌బెంచ్ లిస్టింగ్
గీక్‌బెంచ్ డేటాబేస్ ద్వారా మోటోరోలా నుంచి రాబోవు తదుపరి ఫ్లిప్ ఫోన్ యొక్క పేరు కన్ఫర్మ్ అయ్యింది. Motorola Razr 50 సింగిల్-కోర్ టెస్ట్ లో 1033 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2751 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ మరియు 6జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Motorola Razr 50 గీక్‌బెంచ్ పై ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో లిస్ట్ అయ్యింది. ఇది aito అనే కోడ్‌నేమ్ కలిగి ఉంది. దీని బేస్ ఫ్రీక్వెన్సీ 2.0GHz గా ఉంది. అలాగే మాలి జీ615 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300X చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం.
Motorola Razr 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 3.6-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 3,950 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Motorola Razr 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.











