
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నార్డ్ లవర్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ లిస్టింగ్
OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
లిస్టింగ్‌ని గమనిస్తే, డివైజ్ పేరు OnePlus Nord CE 4 Lite కనిపిస్తోంది.
ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.
OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
చిప్సెట్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 Lite 5G 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.
ఓఎస్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.












