
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus రానున్న కొన్ని నెలల్లో తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉంది. ఈలోపు ఫోన్ కి సంబంధించిన బ్యాటరీ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. OnePlus 13 భారీ బ్యాటరీతో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. అలాగే 2కే 8టీ ఎల్టీపీవో కస్టమ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OnePlus 13 స్పెసిఫికేషన్స్ (లీక్)
OnePlus 13 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేశారు.
లీక్ ప్రకారం, OnePlus 13 డివైజ్ 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది.
OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 2కే 8టీ ఎల్టీపీవో కస్టమ్ డిస్ప్లేతో రానున్నట్లు లీక్ ద్వారా అర్థమవుతోంది.
డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్ మరియు కర్వ్డ్ గ్లాస్ కవర్ తో వస్తున్నట్లు సమాచారం.
OnePlus 13 కెమెరా సిస్టమ్ లో స్వల్ప మార్పు ఉండనుంది. 50ఎంపి పెరిస్కోప్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.
OnePlus 13 లో కెమెరా సిస్టమ్‌ని హాజెల్‌బ్లడ్ తో కలిసి వన్‌ప్లస్ అభివృద్ధి చేస్తోంది.
OnePlus 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ప్రాసెసర్ 2024 అక్టోబర్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. Xiaomi 15, Xiaomi 15 Pro డివైజెస్ 8 జెన్ 4 చిప్ తో వచ్చే మొట్టమొదటి ఫోన్లుగా నిలవనున్నాయి.
OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్స్ పై స్పష్టత రానుంది.
OnePlus 12 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 3168*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2కే 120 హెర్ట్జ్ ప్రోఎక్స్డీఆర్ ఎల్టీపీవో+ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, హైపర్ రెండరింగ్+హైపర్ టచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 4,500 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి.
ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వచ్చింది.
ఓఎస్: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3x టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం OnePlus 12 లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇతర ఫీచర్లు: OnePlus 12 లో 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్సీ, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ క్రయో-వెలాసిటీ వీసీ కూలింగ్ సిస్టమ్, 3డీ స్పేషియల్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి.












