POCO M6 4G: 108ఎంపి కెమెరాతో వస్తోన్న పోకో కొత్త ఫోన్

Highlights

  • రేపే POCO M6 4G లాంచ్
  • తాజాగా గ్లోబల్ సైట్ పై స్పెక్స్
  • 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 4G పేరుతో ఈ ఫోన్ భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా పోకో వెబ్‌సైట్ లో POCO M6 4G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ లిస్ట్ అయ్యాయి. ఈ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది. ఓసారి రివీలైన పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

POCO M6 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO M6 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 20.5:9 యాస్పెక్ట్ రేషియో, 550 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: POCO M6 4G లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: POCO M6 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: POCO M6 4G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

బ్యాటరీ: POCO M6 4G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఓఎస్: POCO M6 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: POCO M6 4G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ-సీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

POCO M6 4G ధర, కలర్ ఆప్షన్స్

POCO M6 4G డివైజ్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 129 డాలర్లు (రూ.10,700) గా నిర్ణయించారు.

POCO M6 4G యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 149 డాలర్లు (సుమారు రూ.12,400) గా ఉంది.

POCO M6 4G స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సిల్వర్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Previous articleVivo V40: లీకైన వివో వీ40 స్పెసిఫికేషన్స్, ధర
Next articleHMD Atlas: 120 హెర్ట్జ్ డిస్ప్లేతో లాంచ్ కానున్న అట్లాస్, త్వరలో లాంచ్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.