Vivo Y58: లీకైన వివో వై58 లాంచ్ టైమ్‌లైన్

Highlights

  • జూన్ ఆఖర్లో Vivo Y58 లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఎల్సీడీ డిస్ప్లే తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y58 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన సమాచారం 91mobiles కి లభించింది. ప్రధానంగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ వివరాలు రివీల్ అయ్యాయి. జూన్ ఆఖర్లో భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo Y58 లాంచ్ టైమ్‌లైన్, ఇతర వివరాలు

ఇండస్ట్రీ వర్గాల నుంచి 91మొబైల్స్ కి Vivo Y58 యొక్క లాంచ్ టైమ్‌లైన్ వివరాలు అందాయి. ఆ సమాచారం ప్రకారం, Vivo Y58 డివైజ్ ఈ నెలాఖరులో భారత్ లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. రానున్న కొన్ని రోజుల్లో వివో నుంచి టీజర్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Vivo Y58 డివైజ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

సెగ్మెంట్ బెస్ట్ బ్రైటెస్ట్ సన్‌లైట్ డిస్ప్లేతో Vivo Y58 రానుందని అంచనా వేస్తున్నారు.

Vivo Y58 యొక్క కెమెరా మరియు డిస్ప్లే విభాగాలు అప్‌గ్రేడ్ అవుతాయని సోర్సెస్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y56 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y56 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y56 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టా-కోర్ చిప్ వాడారు.

కెమెరా: Vivo Y56 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo Y56 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y56 5G లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

Source: 91Mobiles Hindi

Previous articleOneplus 13: లీకైన వన్‌ప్లస్ 13 కెమెరా స్పెసిఫికేషన్స్
Next articleHonor 200 Series: గ్లోబల్‌గా లాంచైన హానర్ 200 సిరీస్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.