Samsung Galaxy F15 5G: భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎఫ్15 ఎయిర్టెల్ ఎడిషన్

Highlights

  • ఎఫ్15 ఎయిర్టెల్ ఎడిషన్ ధర రూ.12,999
  • 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కొన్ని రోజుల క్రితం Galaxy F15 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో మంచి 5జీ ఫోన్‌గా ఈ ఫోన్ కి యూజర్లలో పేరు వచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. తాజాగా Samsung Galaxy F15 5G ఎయిర్టెల్ ఎడిషన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ స్పెషల్ ఎడిషన్ ధర మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F15 5G Airtel ఎడిషన్ ఫీచర్స్

Samsung Galaxy F15 5G ఎయిర్టెల్ ఎడిషన్ కొనేవారికి 50జిబి డేటా కూపన్స్ మరియు రూ.750 వరకు రీచార్జ్ డిస్కౌంట్స్ లభిస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్ శాంసంగ్ ఫోన్ ఎయిర్టెల్ 5జీ సిమ్ తో లాక్ చేయబడి ఉంటుంది. ఈ ఎయిర్టెల్ నంబర్ తో ఫోన్‌ని 18 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ నెట్వర్క్ వదిలి వేరే నెట్వర్క్ కి వెళ్ళాలని అనుకునే కస్టమర్లకు అదనపు చార్జీలు పడతాయి.

Samsung Galaxy F15 5G ఎయిర్టెల్ ఎడిషన్ ధర

Samsung Galaxy F15 5G ఎయిర్టెల్ ఎడిషన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.12,999 గా ఉంది.

Samsung Galaxy F15 5G ఎయిర్టెల్ ఎడిషన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది.

Samsung Galaxy F15 5G ఎయిర్టెల్ ఎడిషన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది.

Samsung Galaxy F15 5G ఎయిర్టెల్ ఎడిషన్ గ్రూవీ వయొలెట్, జాజీ గ్రీన్ మరియు ఆష్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy F15 5G Airtel ఎడిషన్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

Previous articleSamsung Galaxy S24 FE గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు
Next articleMotorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.