
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. భారత్ లో ఈ డివైజ్ జూన్ 18వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓసారి ఈ ఫోన్ లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
OnePlus Nord CE 4 Lite 5G ఇండియా లాంచ్ వివరాలు
OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని వన్‌ప్లస్ బ్రాండ్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 18వ తేదీ ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
జూన్ 18వ తేదీన రాత్రి 7 గంటలకు OnePlus Nord CE 4 Lite 5G లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై ఈ ఫోన్ యొక్క ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది.
There’s a long binge brewing.#ComingSoon pic.twitter.com/12SVVbJc8G
— OnePlus India (@OnePlus_IN) June 14, 2024
OnePlus Nord CE 4 Lite 5G ధర (లీక్)
OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-బడ్జెట్ లో లాంచ్ అవ్వనుంది. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 ఉండవచ్చు. టాప్ వేరియంట్ ధర రూ.22,999 గా ఉండే అవకాశం ఉంది.
OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.
ఓఎస్: OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంటుంది.
కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.











