Vivo T3 Lite 5G ఇండియా లాంచ్ టీజర్ విడుదల

Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G లాంచ్
  • డ్యూయల్ 5జీ తో వస్తోన్న ఫోన్
  • ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న మైక్రో-సైట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. ఇది టీ3 సిరీస్ లో వస్తోన్న మూడో స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని వివో ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్-కార్ట్ పై Vivo T3 Lite 5G యొక్క మైక్రో-సైట్ ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ ఇదే నెలలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Vivo T3 Lite 5G గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు

Vivo T3 Lite 5G డివైజ్ సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్ అని లాంచ్ మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది. త్వరలో లాంచ్ కాబోయే ఈ ఫోన్, Vivo T3x 5G కంటే తక్కువ ధరలో లభించనుంది.

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ సోని ఏఐ కెమెరాతో వస్తోంది. అయితే సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు.

వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో ఉంటుంది. ఇది ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ తో వస్తున్నట్లు ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే, Vivo T3 Lite 5G చూడటానికి Vivo Y18 గ్లోబల్ వేరియంట్ లాగా కనిపిస్తోంది.

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది. ఇదే చిప్సెట్‌ని Realme Narzo N65 5G, C65 5G డివైజెస్ లో వాడారు. జూన్ 24 మరియు జూన్ 25 తేదీల్లో వివో సంస్థ ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ మరియు కెమెరా వివరాలను వెల్లడించనుంది.

Vivo T3 Lite 5G ధర

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి స్పష్టత లేదు. అయితే రానున్న కొన్ని రోజుల్లో ధర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Previous articleXiaomi 14T: ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందిన షావోమి 14టీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం
Next articleRedmi 13 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.