
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO రెనో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO Reno 11A పేరుతో వచ్చిన ఈ డివైజ్ జపాన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. అమోలెడ్ డిస్ప్లే, ఐపీ65 రేటింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OPPO Reno 11A ధర, కలర్ ఆప్షన్స్
OPPO Reno 11A స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను 48,800 యెన్స్ (సుమారు రూ.25,000) గా నిర్ణయించారు. జపాన్ లో ఈ ఫోన్ జూన్ 27 నుంచి బుకింగ్ కి అందుబాటులో ఉంటుంది.
OPPO Reno 11A డివైజ్ కోరల్ పర్పుల్ మరియు డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO Reno 11A స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO Reno 11A లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 2.5డీ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: OPPO Reno 11A లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో ఏఆర్ఎమ్ మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11A డివైజ్ లో 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
బ్యాటరీ: OPPO Reno 11A లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: OPPO Reno 11A లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
సాఫ్ట్వేర్: OPPO Reno 11A డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బరువు, చుట్టుకొలత: OPPO Reno 11A డివైజ్ 162 మి.మీ పొడవు, 75 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం, 177 గ్రాముల బరువు ఉంటుంది.
ఇతర ఫీచర్లు: OPPO Reno 11A లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ-సీ పోర్ట్, ఐపీ65 రేటింగ్ ఉన్నాయి.











